Simhadri Movie: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ ‘సింహాద్రి’ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అస్సలు ఊహించలేరు
యంగ్ టైగర్- దర్శక ధీరుడు రాజమౌళిది బ్లాక్ బస్టర్ కాంబో. స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్స్ ఈ కాంబోలో వచ్చాయి. అయితే ఈ సినిమాల్లో సింహాద్రికి హీరోగా మొదటి ఛాయిస్ జూనియర్ ఎన్టీఆర్ కాదట.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో సింహాద్రి ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. . అంతకుముందు వీరిద్దరి కాంబోలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రాగా సింహాద్రి రెండోది. 2003లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు. అలాగే నాజర్, బ్రహ్మానందం, భానుచందర్, వేణు మాధవ్, శరత్ సక్సేనా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా చేసేనాటికి అతని వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. అయినా అంత చిన్న వయసులోనే తారక్ నట విశ్వరూపం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాక్సాఫీస్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. ఇలా ఎన్టీఆర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచన సింహాద్రి సినిమా గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. అదేంటంటే.. ఈ సినిమాకు మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ కాదట. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ఓ టాలీవుడ్ హీరోకు ఈ కథ చెప్పారట రాజమౌళి. అయితే ఆ హీరో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఎన్టీఆర్ తో తీసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు జక్కన్న. ఇంతకీ సింహాద్రి సినిమాను మిస్ అయిన ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా? ప్రభాస్.
అవును.. రాజమౌళి మొదట ప్రభాస్ తోనే సింహాద్రి సినిమా తీయాలనుకున్నారట. కథ కూడా చెప్పారట. అయితే అప్పటికే ప్రభాస్ పలు సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో జక్కన్న సినిమాకు కాల్షీట్స్ కేటాయించలేకపోయాడట. దీంతో సింహాద్రి సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ప్రభాసే స్వయంగా ఓ సందర్భంలో బయట పెట్టారు. అయితే సింహాద్రి మిస్ అయినా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో నటించాడు ప్రభాస్. ఛత్రపతి సినిమాతో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయిన డార్లింగ్ బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం అతను ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీ ఈ ఏడాది ఆఖరున రిలీజ్ కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








