Cinema : ఏం సిరీస్ మావ.. ప్రతి క్షణం మరణ భయం.. ఒక్కో సీన్‌కు గుండె ఆగిపోవాల్సిందే.. అస్సలు మిస్సవ్వొద్దు..
ప్రస్తుతం ఒక సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రతి క్షణం గుండె ఆగిపోయే సీన్స్.. ఆద్యంతం ఉత్కంఠ.. మరణ భయంతో సాగే అద్భుతమైన థ్రిల్లర్ సిరీస్ ఇది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటటీలో దూసుకుపోతుంది. ఇందులో నటీనటుల యాక్టింగ్, విజువల్స్, బిజీఏం మరింత హైలెట్ అయ్యాయి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరెంటో తెలుసా.. ?

మీకు థ్రిల్లర్ సినిమాలు చూడడం ఇష్టమా… ? అయితే మీ కోసమే ఈ సిరీస్ గురించి చెబుతున్నాము. జాంబీ హారర్ థ్రిల్లర్ శైలికి చెందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒక సీజన్.. మొత్తం 4 ఎపిసోడ్స్ తో సాగే సిరీస్.. షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సిరీస్ హిందీలో రూపొందించారు. ఈ సిరీస్ పేరు బేతాల్. పౌరాణిక కథల ఆధారంగా రూపొందించారు. భారతదేశంలోని కడికోడి గ్రామంలోని ఒక సొరంగ మార్గాన్ని జాతీయ రహదారిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ సొరంగంను కూల్చివేసి రోడ్డు నిర్మించాలని ఉత్తర్వు జారీ చేస్తుంది. అయితే ఆ గ్రామస్తులు మాత్రం సొరంగం జోలికి వెళ్లకూడదని అంటారు. అయితే సైన్యం సాయంతో ఆ సొరంగాన్ని హైవేగా మార్చే ప్లాన్ చేస్తారు. అయితే అప్పుడే అసలు సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది బేతాల్ సిరీస్.
ఊహించని సంఘటనలు, మలుపులు, థ్రిల్లర్ క్షణాలతో సాగుతుంది. ఈ సిరీస్ క్లైమాక్స్ ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది.




