AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబుకు అక్కగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు అమెరికాలో సెటిల్డ్

ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు మహేష్ బాబు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ బు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. అలాంటి మహేష్ బాబుకు ఒక హీరోయిన్ ఓ సినిమాలో అక్కగా మరో సినిమాలో తల్లిగా నటించింది.

Mahesh Babu: మహేష్ బాబుకు అక్కగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు అమెరికాలో సెటిల్డ్
Mahesh Babu
Basha Shek
|

Updated on: Oct 03, 2025 | 9:49 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. సోనాలి బింద్రే, సిమ్రాన్, సాక్షి శివానంద్, ఆర్తి అగర్వాల్, రక్షిత, శ్రియ, త్రిష, ఇలియానా, కాజల్ అగర్వాల్, సమంత, శ్రుతి హాసన్, ప్రణీత, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, శ్రీలీల తదితర హీరోయన్లు మహేష్ తో రొమాన్స్ చేశారు. ప్రీతి జింటా, బిపాసా బసు, అమీషా పటేల్, కృతిసనన్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు కూడా మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ బ్యూటీ కూడా సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయనుంది. అయితే గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఓ అందాల తార మహేష్ బాబు కి ఓ సినిమాలో అక్కగా మరో సినిమాలో తల్లిగా కూడా చేసింది. సాధారణంగా పెళ్లి, పిల్లలు తర్వాత చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తారు. ఈ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సినిమాల్లో నటించిన ఈ అందాల తార ఆ తర్వాత సహాయక నటిగా మెప్పించింది. ఇదే క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి అక్కగా, తల్లిగా నటించింది. ఆమె మరెవరో కాదు గీత కదంబి.

తమిళనాడుకు చెందిన గీత 1978 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. అదే సమయంలో 1990లో వచ్చిన బాలచంద్రుడు సినిమాలో మహేష్ బాబుకు అక్కగానూ నటించింది. అయితే గీత 1997లో ఓ ఛార్టెర్డ్ అకౌంటెంట్ ను పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. ఆ తర్వాత మళ్లీ కొన్నేళ్లకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలా 2003లో ఒక్కడు సినిమాలో మహేష్ కి తల్లి పాత్రలో నటించింది. దీని తర్వాత కూడా పలు సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది గీత. అయితే ప్రస్తుతం ఆమె మళ్లీ అమెరికాకు వెళ్లి అక్కడే సెటిలైపోయిందని సమాచారం.

ఇవి కూడా చదవండి

బాలచంద్రుడు, ఒక్కడు సినిమాల్లో గీత..

Actress Geetha

Actress Geetha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..