Mahesh Babu: మహేష్ బాబు అన్న కూతురు ఎలా ఉందో చూశారా..? హీరోయిన్స్ ఇక సైడ్ అవ్వాల్సిందే..
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ చిత్రాలు.. అద్భుతమైన నటనతో కోట్లాది మంది తెలుగు సినీప్రియులను అలరించారు దివంగత హీరో కృష్ణ. ఇక సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు కంటే ముందే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా తెరంగేట్రం చేశాడు. హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రమేశ్ బాబు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా మారారు. చివరగా 1997లో ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన ఎన్ కౌంటర్ మూవీలో నటించారు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన రమేష్ బాబు.. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు.
తన తమ్ముడు మహేష్ బాబు నటించిన అర్జున్, అతిథి, దూకుడు చిత్రాలను రమేష్ బాబు నిర్మించారు. అయితే కొన్నాళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2022లో జనవరి 8న మరణించారు రమేష్ బాబు. మహేష్ బాబుకు ఆయన అన్న రమేష్ బాబు అంటే ప్రాణం. ఎన్నోసార్లు తన అన్నయ్య గురించి ప్రస్తావించారు. రమేష్ బాబుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే రమేష్ బాబు కూతురు భారతి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు.
కానీ తన చెల్లెలు సితార ఘట్టమనేనితో కలిసి అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటుంది. తాజాగా భారతి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భారతి చూడచక్కగా ఎంతో అందంగా కనిపిస్తుంది. దీంతో ఆమె ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారతి విదేశాల్లో చదువుకుంటుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
