AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : కాంతార చాప్టర్ 1 చిత్రాన్నే వెనక్కు నెట్టిన చిన్న సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే బాక్సాఫీస్ షేక్..

2025 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూల్లు రాబట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ కేవలం రూ..50 లక్షలతో నిర్మించిన ఓ సినిమా ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీస్తే.. ఏకంగా కాంతార చాప్టర్ 1 చిత్రాన్నే వెనక్కు నెట్టింది. అంతేకాదు..విక్కి కౌశల్, రష్మిక నటించిన చావా మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది.

Cinema : కాంతార చాప్టర్ 1 చిత్రాన్నే వెనక్కు నెట్టిన చిన్న సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే బాక్సాఫీస్ షేక్..
Cinema (15)
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2025 | 5:19 PM

Share

ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ ఏడాదిలో చాలా సినిమాలు థియేటర్లలో ఘన విజయం సాధించాయి. అలాగే భారీ బడ్జెట్ చిత్రాల రికార్డ్స్ సైతం బ్రేక్ చేశాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా చావా, కాంతార చాప్టర్ 1 సినిమాలను వెనక్కు నెట్టింటింది. ప్రస్తుతం బాక్సాఫీస్ లాభాలను శాసిస్తున్న సినిమా ఏంటో తెలుసుకుందామా. ఆ మూవీ పేరు “లాలో: కృష్ణ సదా సహాయతే.” ఇందులో సూపర్ స్టార్ హీరోహీరోయిన్లు లేరు. ఇది ఒక సాధారణ గుజరాతీ సినిమా. ఈ సంవత్సరం ఏ ఇతర సినిమా సాధించలేని విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..

ఈ చిన్న గుజరాతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ సైయారా, కాంతార చాప్టర్ 1 సినిమాలను వెనక్కు నెట్టింది. కేవలం రూ.50 లక్షలతో నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ నెలలో అడియన్స్ ముందుకు వచ్చింది. మొదట్లో అంతగా వసూల్లు రాలేదు. కానీ మౌత్ టాక్ కారణంగా ఇప్పుడు ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన లాలో చిత్రం ఒక రిక్షా పుల్లర్ కథ. తను ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుని తన గతంలోని వెంటాడే నీడలను ఎదుర్కొంటాడు, ఆ సమయంలో అతనికి శ్రీకృష్ణుని దర్శనం లభిస్తుంది. విడుదలైన మూడు వారాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన గుజరాతీ చిత్రంగా నిలిచింది. అలాగే ఆరు వారాల తర్వాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..

ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడు భారతీయ చిత్రాలు కూడా లాభదాయకత పరంగా “లాలో: కృష్ణ సదా సహాయతే”తో పోల్చితే చాలా తక్కువ. “కాంతార చాప్టర్ 1” రూ.125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తే 850 కోట్ల రూపాయలు సంపాదించింది, లేదా కేవలం ఏడు రెట్లు లాభం. చావా సినిమాను రూ.90 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.808 కోట్లు సంపాదించింది. అలాగే ఆ సినిమాకు దాదాపు తొమ్మిది రెట్లు లాభం వచ్చింది. అదే సమయంలో రూ.45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన రొమాంటిక్ డ్రామా “సైయారా” బాక్సాఫీస్ వద్ద 13 రెట్లు ఎక్కువ సంపాదించింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..

Follow Us