Kantara Chapter 1: ‘మిస్ యూ అన్నా’.. ‘కాంతార2’లో కడుపుబ్బా నవ్వించిన ఈ నటుడు ఎలా కన్నుమూశాడో తెలుసా?
కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కాంతార ఛాప్టర్ 1. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.

సుమారు మూడేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కాంతారా ఛాప్టర్ 1. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రిషభ్ శెట్టినే రెండో పార్ట్ కు కూడా దర్శకత్వం వహించాడు. అంతే కాదు సినిమాలో మెయిన్ లీడ్ పోషించాడు. దసరా కానుకగా అక్టోబర్ 02న రిలీజైన ఈ డివోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కించిన కాంతార 2 సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది.అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఇదే సినిమాలో ఓ ప్రముఖ కమెడియన్ కూడా నటించాడు. సినిమా చూసిన వారందరూ అతని నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో అతనికి నివాళి అర్పిస్తూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ నటుడు కొన్ని రోజుల క్రితమే గుండె పోటుతో కన్నుమూశాడు.
కాంతార చాప్టర్-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్ పూజారి నటన అద్బుతంగా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే 34 ఏళ్ల వయసున్న ఈ నటుడు ఈ ఏడాది మే 13న గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన స్నేహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో రాకేశ్ పాల్గొన్నాడు. అక్కడ డ్యాన్స్ చేస్తుండగా గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి చేర్పించేలోపే అతను తుదిశ్వాస విడిచాడు.
కాంతార 2 సినిమాలో రాకేశ్ పూజారి..
View this post on Instagram
కన్నడతో పాటు తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించాడు రాకేశ్ పూజారి. కన్నడలో ప్రముఖ టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 విన్నర్‌గా కూడా నిలిచాడు. ఇదే క్రమంలో కాంతార 2లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. అయితే సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన తర్వాతే గుండెపోటుతో కన్నుమూశాడు రాకేశ్. ఇప్పుడు కాంతార 2 సినిమాను చూసిన ఆడియెన్స్ ఈ నటుడిని చూసి ఎమోషనల్ అవుతున్నారు. కాగా రాకేశ్ పూజారి పాత్రకు తెలుగు వాయిస్ డబ్బింగ్ కమెడియన్ బబ్లూ చెప్పడం గమనార్హం.
This is guy was one of prime comedians in #KantaraChapter1
He died of heart attack on May 13…during dancing in a mehandi event ….He is just 34
His name is RAKESH POOJARY pic.twitter.com/y8QaIIebJp
— 𝘚𝘸𝘦𝘵𝘩𝘢 𝘊𝘩𝘰𝘸𝘥𝘢𝘳𝘺 🎀 (@vibeofswetha) October 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




