Tollywood: 2015లో అబార్షన్.. మళ్లీ ఇన్నాళ్లకు తల్లి కాబోతున్న టాలీవుడ్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?
2013లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకుందీ అందాల తార. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా రెండేళ్లకు అంటే 2015లో గర్భం దాల్చింది. కానీ థైరాయిడ్ సమస్య ఉండడంతో దురదృష్టవశాత్తూ అబార్షన్ అయ్యింది. ఇది జరిగిన పదేళ్లకు మళ్లీ గర్భం దాల్చిందీ ముద్దుగుమ్మ.

పెళ్లైన ప్రతి అమ్మాయి అమ్మవ్వాలనుకుంటోంది. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్, ఇతర సమస్యలు మహిళల్లో సంతానలేమికి దారి తీస్తున్నాయి. ఈ కారణంగానే చాలామంది పెళ్లైన అమ్మాయిలు పిల్లల కోసం కృత్రిమ గర్భధారణ పద్దతులను ఆశ్రయిస్తున్నారు. గుడులు, దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అలా 12 ఏళ్ల క్రితం పెళ్లిపీటలెక్కి పిల్లల కోసం ఎదురు చూస్తోన్న ఓ టాలీవుడ్ ప్రముఖ నటి ఇప్పుడు గర్భం దాల్చింది. దీంతో ఆ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఎప్పుడెప్పుడు బిడ్డను చేతుల్లోకి తీసుకుందామా? అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇంతకీ ఆ అందాల తార ఎవరనుకుంటున్నారా? విక్టరీ వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో పింకీ అలియాస్ సుదీప్ గుర్తుందిగా.. ఇప్పుడామె తల్లి కానుంది. ఈ శుభవార్తను ఆమెనే సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా భర్త శ్రీరంగనాథ్‌తో కలిసి మెటర్నటీ షూట్ చేయించుకున్న సుదీప ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘ నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.. ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది. ఇప్పుడు మా ఫ్యామిలీ మరింత పెద్దదవుతోంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది సుదీప.
పింకీ అలియాస్ సుదీప్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నటికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సుదీపకు పెళ్లయి దాదాపు 12 ఏళ్లవుతోంది. 2015లో మొదటి సారి గర్భం దాల్చింది. అయితే అదే సమయంలో ఆమెకు థైరాయిడ్ సమస్య ఉండడంతో బిడ్డను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించింది.
పింకీ అలియాస్ సుదీప మెటర్నిటీ ఫొటో షూట్ వీడియో..
View this post on Instagram
1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పింకీ. ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసింది. ఆరోవారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఆ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ..
View this post on Instagram
భర్త రంగనాథ్ తో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




