Mahavatar Narasimha: ఓటీటీలోకి మహావతార్ నరసింహ.. స్ట్రీమింగ్ పై నిర్మాణ సంస్థ పోస్ట్ వైరల్..
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న సినిమా మహావతార్ నరసింహ. చిన్న సినిమాగా విడుదలైన పెద్ద విజయం సాధించింది. యానిమేషన్ మూవీ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా మహావతార్ నరసింహ. చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇటీవలే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కేవలం పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ. అలా చేసి ఫస్ట్ యానిమేషన్ సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. మొదటి రోజు ఏకంగా రూ.1.35 కోట్లు రాబట్టింది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం థియేటర్లలో ఓ రేంజ్ లో సందడి చేస్తుంది. శ్రీ మహావిష్ణు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందించిన ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైంది. ఓవైపు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..
ఓ ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా సెప్టెంబరులో గానీ.. లేదా అక్టోబర్ లో గానీ స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం నడుస్తుంది. తాజాగా ీ రూమర్స్ పై నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకుంది. “మహావతార్ నరసింహ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందనే ప్రచారం మా దృష్టికి వచ్చింది. దానిపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మేము ఖరారు చేయలేదు. మా సోషల్ మీడియా ఖాతాలో వచ్చే అప్డేట్స్ మాత్రమే నమ్మండి ” అంటూ పోస్ట్ చేసింది. దీంతో మహవతార్ నరసింహా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై స్పష్టత వచ్చింది.
ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
జూలై 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేషన్ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఈ మూవీ. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
We’re grateful for the excitement around Mahavatar Narsimha and the OTT buzz — But as of now, the film is ONLY playing in theatres worldwide.No OTT deal has been finalized yet.Please trust only the updates shared from our official handles. pic.twitter.com/Q5Sw8yEMF4
— Kleem Productions (@kleemproduction) August 5, 2025
ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..




