AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రోడ్డు పక్కన డాబా వద్ద లుంగీతో ఉన్న ఈ టాలీవుడ్ కుర్ర హీరో ఎవరో గుర్తుపట్టారా..?

ఎటవంటి హంగామా, హడావిడి లేకుండా రోడ్డు పక్కన డాబా వద్ద లుంగీతో కనిపించిన ఈ టాలీవుడ్ కుర్ర హీరో ఎవరో మీరు కనిపెట్టగలరా..?

Tollywood: రోడ్డు పక్కన డాబా వద్ద లుంగీతో ఉన్న ఈ టాలీవుడ్ కుర్ర హీరో ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood Hero
Ram Naramaneni
|

Updated on: Jun 26, 2022 | 5:00 PM

Share

Telugu Fil Hero: హీరో అనగానే ఓ ఇద్దరు.. ముగ్గురు అసిస్టెంట్స్ ఉంటారు.. ఓ మోస్తారు హీరో అయితే ఇద్దరు బౌన్సర్స్ కూడా పక్కనే ఉంటారు. పెద్ద హీరో విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు. కాగా చిన్న.. చిన్న హిట్స్ కొట్టిన హీరోలు బయటకు వెళ్లినా కూడా.. జనం ఎగబడతారు కాబట్టి.. వారిని అదుపు చేసేందుకు బౌన్సర్లను పెట్టుకుంటారు. హీరో అంటే రేంజ్‌కు తగ్గట్లు డ్రస్సింగ్ ఉంటంది. మంచి గాగుల్స్ కూడా ఉంటాయి. అవేం లేకుండా రోడ్డు పక్కన ఉన్న ఓ డాబా వద్ద కనిపించాడు ఓ కుర్ర హీరో. ప్రజంట్ మంచి ఫామ్‌లో ఉన్న ఈ నటుడు చాలా సాదాసీదాగా అక్కడ నడుస్తూ కనిపించాడు. అందులో అతడు లుంగీ కట్టుకుని కనిపించడంతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఇంతకీ అతడెవరో మీరు కనిపెట్టరా..? గుర్తిస్తే ఓకే.. గుర్తించని వాళ్లకు ఇప్పుడు అతనెవరో రివీల్ చేయబోతున్నాం. ఈ హీరో ఎవరో కాదు ఇటీవలే ‘సమ్మతమే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఫస్ట్ మూవీతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు కిరణ్. ఆ వెంటనే ఎస్.ఆర్.కళ్యాణమండపం, సెబాస్టియన్‌ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ‘సమ్మతమే’ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అయితే ఇటీవల అతను హైదరాబాద్‌లోని రోడ్డు పక్కన ఉన్న డాబాకు వెళ్లాడు. ఏ మాత్రం హడావిడి లేకుండా.. లుంగీతో అక్కడికి వెళ్లిన ఈ కుర్ర హీరోను చూసి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి లోనయ్యారు. కొంతమంది ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రజంట్ అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి