Akkineni Nagarjuna: అలాంటి సినిమాలు చేయను.. కింగ్ నాగార్జున క్లారిటీ ఇచ్చేసినట్టేనా.?

కింగ్ నాగార్జున ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. రీసెంట్ గా బంగార్రాజు సినిమా తో వచ్చిన నాగార్జున మంచి విజయాన్ని అందుకున్నారు.

Akkineni Nagarjuna: అలాంటి సినిమాలు చేయను.. కింగ్ నాగార్జున క్లారిటీ ఇచ్చేసినట్టేనా.?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 24, 2022 | 6:14 PM

Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. రీసెంట్ గా బంగార్రాజు సినిమా తో వచ్చిన నాగార్జున మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా నాగ చైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా విరుచుకుపడుతున్న సమయంలో సినిమాలన్నీ వెనకడుగేసినా.. నాగార్జున మాత్రం దైర్యంగా సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. బంగారాజు సినిమా తర్వాత నాగార్జున ఓ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారు. ‘ది ఘోస్ట్’  అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. వయసు ఆరు పదులు దాటినా కూడా ఇప్పటికీ నవ మన్మధుడు అంటూ లేడీ ఫ్యాన్స్ తో అనిపించుకుంటున్నారు నాగ్. తాజాగా ఓ ఇంటార్వ్యులో నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నాగార్జున ఇప్పటివరకు స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇక పై కూడా చేసే ఉద్దేశం లేదట నాగార్జునకి. హీరోగా ముందు ముందు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాని స్పోర్ట్స్ డ్రామా కథతో నాగార్జున సినిమా చేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తుంది. ఈ వయసులో అలాంటి సినిమాలు నేను చేయలేను అనిచెప్పకనే చెప్పారట నాగ్. స్పోర్ట్స్ మూవీ అంటే ఫిట్నెస్ ఒక్కటే కాదు కాబట్టి అలాంటి సినిమా చేయను అని నాగార్జున చెప్పారని టాక్ నడుస్తుంది. ఇక నాగార్జున హీరోగా సినిమాలు చేస్తూనే కుర్ర హీరోలతో కలిసి మల్టీ స్టారర్ మూవీ కూడా చేయడని రెడీ అయ్యారు. ఇప్పటికే నాని తో కలిసి దేవ్ దాస్, అలాగే రాజు గారి గది 2 సినిమాల్లో నటించారు నాగ్. ప్రస్తుతం కుర్ర హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు నాగార్జున.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ranga Ranga Vaibhavanga: రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో.. టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్.. 

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Vishnu Priya: సమంత పాటకు విష్ణుప్రియ రిహర్సల్ అదుర్స్.. ఊ అంటావ మావ అంటూ రచ్చ..