Rishab shetty: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన రిషబ్..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. కాంతార సక్సెస్‌తో వచ్చిన క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో జోరు చూపిస్తున్నారు. అయితే కాంతార ఛాప్టర్ వన్ తరువాత రిషబ్ చేయబోయే సినిమా విషయంలో ఉన్న కన్‌ఫ్యూజన్‌కు కూడా లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

రిజీనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్‌గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతార సినిమాలో స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన రిషబ్, ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో వెంటనే ప్రీక్వెల్‌ను రూపొందించారు. ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతార ఛాప్టర్ 1 రిలీజ్ కావటంతో రిషబ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న జై హానుమాన్ సినిమాలో టైటిల్ రోల్‌లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచటంలో సూపర్ సక్సెస్ అయ్యారు.
జై హనుమాన్‌తో పాటు బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహరాజ్’ అనే మూవీని కూడా లైన్‌లో పెట్టారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ఏ మూవీ సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో ఇన్నాళ్లు కన్‌ఫ్యూజన్ ఉంది. కానీ లేటెస్ట్ అప్‌డేట్‌తో అన్ని అనుమానాలకు చెక్ పెట్టారు రిషబ్. కాంతార ఛాప్టర్ 1 ప్రమోషన్స్‌లో నెక్ట్స్ జై హనుమాన్ స్టార్ట్ అవుతుందన్నారు రిషబ్, ఇప్పుడు అదే అప్‌డేట్‌కు కొనసాగింపుగా జనవరిలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా కోసం ఐదు నెలల పాటు డేట్స్ ఇచ్చారు. జై హనుమాన్ పూర్తయిన వెంటనే బాలీవుడ్ ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ మూవీని పట్టాలెక్కిస్తారు.
ఈ అప్‌డేట్‌తో ప్రశాంత్ వర్మ సినిమాల విషయంలోనూ క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ నాలుగైదు సినిమాలు ఎనౌన్స్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఏ సినిమా ముందు సెట్స్ మీదకు తీసుకెళతారన్న విషయంలో డౌట్స్ ఉన్నాయి. ఈ అనుమానాలకు చెక్ పెడుతూ త్వరలో జై హనుమాన్ ప్రారంభిచబోతున్నారన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




