Yash: కల్కి సినిమా పై రాకీ భాయ్ ట్వీట్.. మూవీ ఓ అద్భుతమైన అనుభవం అంటూ..

అభిమానులతో పాటు ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా థియేటర్‌కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు కూడా కల్కి సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఈ సినిమా అద్భుతంగా ఉందని.. ప్రభాస్ ఇరగదీశాడు అని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

Yash: కల్కి సినిమా పై రాకీ భాయ్ ట్వీట్.. మూవీ ఓ అద్భుతమైన అనుభవం అంటూ..
Kalki 2898 Ad
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 28, 2024 | 7:54 PM

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎడి ‘ సంచలనాలు సృష్టిస్తుంది. నిన్న (జూన్ 27) విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల సందడి చేస్తోంది. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా థియేటర్‌కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు వరకూ కల్కి సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఈ సినిమా అద్భుతంగా ఉందని.. ప్రభాస్ ఇరగదీశాడు అని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి కల్కి సినిమా పై క్రేజీ కామెంట్స్ చేశారు. డార్లింగ్ చింపేశాడు.. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాజమౌళి.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసి సినిమా గురించి ట్వీట్ చేశారు. కన్నుల పండుగగా అద్భుతమైన విజువల్స్ రూపొందించిన ‘కల్కి 2898 ఏడీ ‘ బృందానికి నమస్కారాలు. కథలను మరింత క్రియేటివ్‌గా చెప్పే మార్గాన్ని ఈ సినిమా చూపించింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌  పెద్ద కలలు కనే ధైర్యాన్ని, పెద్ద అడుగులు వేయడానికి ఈ సినిమా దోహదపడింది అని రాసుకొచ్చాడు. అలాగే ‘డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ సర్, కమల్ హాసన్ సర్, దీపికా పదుకొణె కొన్ని సర్‌ప్రైజ్ అతిధి పాత్రలను కలిపి చూడటం అద్భుతమైన అనుభవం. ఇలాంటి అద్భుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా నిజంగా వెండితెరపై వెలుగులు నింపుతోంది అని రాసుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి : Srihari: సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా.? ఆ కోరిక తీరకుండానే

యష్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కేజీఎఫ్ తో అన్ని ఏరియాల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు యాష్. నటుడు యష్ ‘టాక్సిక్’ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ సినిమా షూటింగ్ జరుగుతోంది. మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ నటీమణులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘టాక్సిక్’ చిత్రానికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.