Srihari: సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా.? ఆ కోరిక తీరకుండానే

ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇండస్ట్రీలో ఇప్పటికి ఆయన గురించి.. ఆయన మంచి తనం గురించి చెప్పుకుంటుంటారు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి.. అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు.

Srihari: సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేసేవారో తెలుసా.? ఆ కోరిక తీరకుండానే
Actor Srihari
Follow us

|

Updated on: Jun 28, 2024 | 4:53 PM

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇండస్ట్రీలో ఇప్పటికి ఆయన గురించి.. ఆయన మంచి తనం గురించి చెప్పుకుంటుంటారు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి.. అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు ‘ధర్మక్షేత్రం’ చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు. శ్రీహరి దాదాపు 100 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

శ్రీహరి నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రల్లో నటించారు శ్రీహరి. మగధీర సినిమాలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి. షేర్ ఖాన్ పాత్ర‌లో త‌న గంభీర‌మైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశారు. శ్రీహ‌రి హీరోగా న‌టించిన కుబుసం, భ‌ద్రాచ‌లం సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

అయితే సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేశేవారో తెలుసా.? జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాగా సినిమాల్లోకి రాక ముందు ‘మిస్టర్ హైదరాబాద్ గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:M S Narayana: చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం..

శ్రీహరి ఫ్యామిలీ సినిమాల్లోకి రాక ముందు పాల వ్యాపారం చేశారు. హైదరాబాద్ లో శ్రీహ‌రి కుటుంబం పాల బిజినెస్ అలాగే మెకానిక్ షెడ్ ద్వారా జీవనం సాగించేవారు. శ్రీహరి కూడా మెకానిక్ షెడ్ లో పని చేశారు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు అదే థియేటర్ లో చూసేవాడు. శ్రీహరి ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న స‌మ‌యంలో దాస‌రి గుర్తించి బ్ర‌హ్మ‌నాయుడు సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఆతర్వాత ఆయన విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. శ్రీహరి హీరోగా చేసిన మొదటి చిత్రం ‘పోలీస్’ అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం ‘పోలీస్ గేమ్’ కావడం విశేషం. కాగా బాలీవుడ్ రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న ముంబై లో శ్రీహరి కన్నుమూసారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..