Upendra : అలా అయితేనే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం చేసుకోరు.. దర్శన్ అరెస్ట్ పై స్పందించిన ఉపేంద్ర
రేణుకాస్వామి హత్య కేసులో పలువురు సినీ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు దర్శన్ కు అండగా నిలిస్తే మరికొందరు దర్శన్ ను వ్యతిరేకించారు. దర్శన్ అరెస్ట్ అయిన వారం తర్వాత ఈ ఘటనపై నటుడు ఉపేంద్ర తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

రేణుకాస్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. నటుడు దర్శన్ ప్రియురాలి కోసం ఓ వ్యక్తి దారుణంగా హత్య చేయించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా రేణుకాస్వామి హత్య కేసులో పలువురు సినీ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు దర్శన్ కు అండగా నిలిస్తే.. మరికొందరు దర్శన్ ను వ్యతిరేకించారు. దర్శన్ అరెస్ట్ అయిన వారం తర్వాత ఈ ఘటనపై నటుడు ఉపేంద్ర తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
దర్శన్ అరెస్ట్, రేణుకాస్వామి హత్య కేసు, దాని విచారణ పై కర్ణాటక మాత్రమే కాదు.. యావత్ భారతదేశం గత కొన్ని రోజులుగా ఉత్కంఠగా చూస్తోంది. ఈ హై ప్రొఫైల్ కేసు విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అలాగే జరిగే న్యాయం కోసం అందరూ వేచి చూస్తున్నారు. దీని పై ఉపేంద్ర స్పందిస్తూ.. ‘‘రేణుకా స్వామి కుటుంబం, ప్రజలు, టీవీ మీడియా, దర్శన్ అభిమానుల్లో కొంత ఆందోళన, అనుమానాలు, ఊహాగానాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, విచారణకు సంబందించిన వీడియో రికార్డులు, సాక్షుల వివరాలన్నింటినీ పోలీసులు ఎప్పటికప్పుడు సంబంధిత వ్యక్తుల కుటుంబాలతో పంచుకోవాలి. అది చట్టంగా మారాలి. గతంలో పోలీసులు ఇంటరాగేషన్‌కు సంబంధించిన వివరాలను రాసి నమోదు చేసేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో, ప్రతి విషయాన్ని వీడియో రికార్డు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేలా న్యాయ సంస్కరణలు జరగాలి.
“అలాగే, ఒక పబ్లిక్ ఫిగర్ మీద కేసు ఉంటే, పోలీసులు ఆ కేసు విచారణ వీడియో రికార్డులు, సాక్షుల అన్ని వివరాలను బహిరంగపరచాలి. పబ్లిక్ ఫిగర్ విచారణ పూర్తి పారదర్శకతతో బహిరంగంగా జరగాలి. అప్పుడే సాక్ష్యాలను ధ్వంసం చేయడం, పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం, అవినీతి వీటన్నింటికీ తెర పడుతుంది’ అని ఉపేంద్ర అన్నారు. అదే విధంగా రేణుకా స్వామి కుటుంబం, ప్రజలు, దర్శన్ అభిమానులకు పోలీసులు, టీవీ మీడియాపై అయోమయం లేకుండా గౌరవం పెరుగుతుందని, న్యాయం జరుగుతుందని’ ఉపేంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
ದರ್ಶನ್ – ರೇಣುಕಾ ಸ್ವಾಮಿ – ಪಾರದರ್ಶಕ ವಿಚಾರಣೆ ….. ಕಳೆದ ಕೆಲವು ದಿನಗಳಿಂದ ನಡೆಯುತ್ತಿರುವ ದರ್ಶನ್ ಬಂಧನ ರೇಣುಕಾ ಸ್ವಾಮಿ ಕೊಲೆ ಪ್ರಕರಣ ಮತ್ತು ಅದರ ವಿಚಾರಣೆ ಇಡೀ ಕರ್ನಾಟಕ ಮಾತ್ರವಲ್ಲ ಇಡೀ ಭಾರತವೇ ಭೆರಗಾಗಿ ನೋಡುತ್ತಿದೆ. ಈ ಹೈ ಪ್ರೊಫೈಲ್ ಕೇಸ್ ನ ವಿಚಾರಣೆಯಲ್ಲಿ ನಿಶ್ಪಕ್ಷಪಾತವಾದ ನಿರ್ಣಯ ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ.…
— Upendra (@nimmaupendra) June 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.