Tollywood: సంతోషం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? ఆశ్చర్యపోవాల్సిందే

సంతోషం సినిమాలో ఈ చిన్న పిల్లాడు అందరికీ గుర్తున్నాడు కదా.. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో కనిపించాడు ఈ కుర్రాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు..? ఎలా ఉన్నాడో తెలుసుకుందాం పదండి...

Tollywood: సంతోషం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? ఆశ్చర్యపోవాల్సిందే
Santosham Movie Child Artist
Follow us

|

Updated on: Jun 17, 2024 | 6:37 PM

2002లో వచ్చిన సంతోషం సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, శ్రియా, ప్రభుదేవా, గ్రేసీ సింగ్ ఈ మూవీలో కీ రోల్స్ పోషించారు. కుటుంబ కథా చిత్రాలను చెక్కడంతో మంచి నేర్పరిగా పేరున్న దశరథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ నిర్మించగా… ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందిచాడు. ఈ పాటలు ఎవర్‌గ్రీన్ క్లాసిన్స్ అనే చెప్పాలి. ‘దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా’, ‘నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస’, ‘నే తొలిసారిగా కలగన్నది నిన్ను కదా’, ‘డిరి డిరి డిరిడీ వారెవ్వా’, పాటను ఇప్పటికీ కొందరు అదే పనిగా వింటూనే ఉంటారు.

ఇందులో కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తాడు నాగార్జున. ఓ కొడుక్కి తండ్రిగా భలే ఎమెషన్స్ పండిస్తాడు. ఇందులో నాగ్ కుమారుడిగా నటించిన చిన్నోడు గుర్తున్నాడా..? కళ్లజోడు పెట్టుకుని.. చబ్బీగా, క్యూట్‌గా ఉండే ఈ చిన్నోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అతడు మంచి యంగ్ ఏజ్‌లో క్లాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. లక్కీ పాత్రలో కనిపించిన ఈ బుడ్డోడు.. పెద్దోడయ్యి.. బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు. ఇతని పేరు.. అక్షయ్ బచ్చు. తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అందులో ఒకటి మన్మధుడు కాగా, మరో మూవీ వర్షం. వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడిగా, యాంకర్ సుమ తనయుడిగా కనిపించాడు. కేవలం సినిమాల్లోనే కాదు పలు ఎడ్వర్టైజ్‌మెంట్స్‌లో కూడా నటించాడు. ఎంఎస్ ధోనీతో డాబర్ చవ్యన్ ఫ్రాష్, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్, స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్, నెస్లే చాకో స్టిక్, కలర్ స్కెచ్ పెన్నులు వంటి యాడ్స్‌లో కనిపించాడు

చైల్డ్ ఆర్టిస్ట్‌గా 2005లో అంజానే సినిమాతో బాలీవుడ్‌లోనూ తెరంగ్రేట్రం చేశాడు. బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించాడు. పెద్ద వాడయ్యాక.. బ్లర్, సత్యమేవ జయతే, రుద్ర వంటి సినిమాల్లో నటించాడు. రాస్ బరీ, ముంబై డైరీస్ వంటి వెబ్ సిరీస్‌ల్లో రోల్స్ చేశాడు. అక్షయ్ బచ్చు కేవలం యాక్టర్ మాత్రమే కాదు సింగర్ కూడా.  హిందీ పాటలకు అతను చేసే కవర్ వర్షన్స్ చాలా పాపులర్. ప్రజంట్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు నాట పుట్టి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫేట్ మార్చుకునేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ ఏడాది మే 9కి సంతోషం సినిమా వచ్చి అప్పుడే 22 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles