AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. ఈ స్టార్ హీరోయిన్ సింపుల్‌గా నో చెప్పిందట..!

మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ దర్శకుడిగా ఉన్న ఆయన.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారారు. రాజమౌళి తర్వాత చాలా మంది దర్శకులు ఆయన మార్గంలో నడుస్తూ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించారు. బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ రూ. 15కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది.

రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. ఈ స్టార్ హీరోయిన్ సింపుల్‌గా నో చెప్పిందట..!
Rajamouli
Rajeev Rayala
|

Updated on: Jun 17, 2024 | 7:08 PM

Share

దర్శకుడు రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఇండియా వైడ్ గానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలల వ్యాపించేలా చేశారు రాజమౌళి. పరాజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీని ఏలుతున్నారు రాజమౌళి. మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ దర్శకుడిగా ఉన్న ఆయన.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారారు. రాజమౌళి తర్వాత చాలా మంది దర్శకులు ఆయన మార్గంలో నడుస్తూ పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించారు. బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ రూ. 15కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది. అలాగే రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ ను ఆకట్టుకున్నారు.

ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు ను కూడా సొంతం చేసుకుంది. ఆస్కార్ వేదిక పై తెలుగు సినిమా నిలబడేలా చేశారు రాజమౌళి. అయితే రాజమౌళితో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరు అనుకుంటారు. ఆయన సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చాలు అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట.

రాజమౌళి స్వయంగా పిలిచి మరి హీరోయిన్ గా అవకాశం ఇస్తే.. ఆ అమ్మడు సింపుల్ గా రిజక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు చెన్నై చిన్నది త్రిష. ఈ ముద్దుగుమ్మ జక్కన్న ఆఫర్స్‌ను రిజెక్ట్ చేసిందట. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన సినిమా మర్యాద రామన్న ఈ సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ అనుకున్నారట రాజమౌళి. అయితే అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్.. తన సినిమాలో కమెడియన్‌గా నటించిన సునీల్ కు జోడిగా నటించడానికి ఆమె సంకోచిందట. స్టార్ దర్శకుడు అయినప్పటికీ సునీల్ సరసన అనేసరికి త్రిష ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందట. దాంతో రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్స్ కాకుండా కొత్త హీరోయిన్స్ ను వెతకడం మొదలుపెట్టారు ఆ క్రమంలోనే సలోనిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. మర్యాద రామన్న సినిమా తర్వాత సలోనికి పెద్దగా సినిమా ఛాన్స్ లు రాలేదు. చిన్న చిన్న సినిమాల్లో కనిపించింది. ఇక త్రిష విషయానికొస్తే ఇప్పుడు ఆమె తెలుగు, తమిళ్ లో బిజీగా మారిపోయింది. అలాగే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?