Darshan : జైలు సిబ్బందికి క్షమాపణలు చెప్పిన దర్శన్.. కారణం ఏంటంటే
దర్శన్‌కు వైద్య చికిత్స కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని షరతులు విధిస్తూ దర్శన్ చికిత్సకు అనుమతించింది. దర్శన్ తన పాస్ పోర్టును ట్రయల్ కోర్టు ముందు సరెండర్ చేయాలని సూచించింది.
బళ్లారి జైలు నుంచి దర్శన్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్నాడుదర్శన్. ఆరోగ్య కారణాల రీత్యా ఇప్పుడు బెయిల్ పై ఆయన బయటకు తీసుకొచ్చారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. దర్శన్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్‌కు వైద్య చికిత్స కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బయటకు వచ్చిన దర్శన్ కొందరికి క్షమాపణలు చెప్పినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
రేణుకా స్వాని హత్యకేసులో దర్శన్ జూన్ 11న అరెస్టయ్యాడు. బెంగుళూరు జైలులో హాయిగా గడుపుతున్న ఆయన బళ్లారి సెంట్రల్ జైలులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెన్ను నొప్పి పెరిగిపోవడంతో.. చికిత్స చేయించుకోవడం కోసం దర్శన్ రెండు వారాల పాటు బెయిల్ తీసుకున్నాడు. కాగా దర్శన్ రెండు నెలల పాటు బళ్లారి జైలులో ఉన్నాడు. ఇప్పుడు దర్శన్ జైలు సిబ్బందికి క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది. నేనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి’ అని దర్శన్ కోరినట్లు సమాచారం.
‘నాకు అది కావాలి, ఇది కావాలి అని పదే పదే అడిగేవాన్ని.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అని దర్శన్ కోరినట్లు సమాచారం. అలాగే, హై సెక్యూరిటీ సెల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది కూడా దర్శన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన వైద్యం చేయించుకోండి, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి’ అని జైలు సిబ్బంది దర్శన్ కు చెప్పినట్టు సమాచారం. దర్శన్ బళ్లారి జైలులో చేరినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి డిమాండ్లు చేస్తూనే ఉన్నాడు. ముందుగా జైల్లో టీవీ కావాలి అన్నాడు. ఆ తర్వాత కుర్చీ కావాలని డిమాండ్ చేశారు. ఇలా దర్శన్ అనేక డిమాండ్లను చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.