AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియా హీరో యశ్‌‌కు ఊహించని షాక్.. కర్నాటక సర్కార్ సీరియస్

పాన్ ఇండియా స్టార్‌ యశ్‌.. అప్ కమింగ్ మూవీ టాక్సిక్‌ కాంట్రవర్శీకి కేరాఫ్‌గా మారింది. పాన్‌ ఇండియా నరుకుడుతో వివాదంలో ఇరుక్కుని ఏకంగా షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. భారీ సెట్టు కోసం దట్టమైన చెట్లు తొలగించారనేది ప్రధాన ఆరోపణ. ఇంతకీ ఆ వాదనలో నిజమెంత? కర్నాటక సర్కార్ ఏం చేయబోతోంది?

Rajeev Rayala
|

Updated on: Oct 31, 2024 | 10:28 AM

Share

ఫాన్ ఇండియా హీరో ఇమేజ్ అంటే వేరే లెవెల్. అందుకే ఆ హీరోలంతా భారీతనాన్ని కోరుకుంటారు. కన్నడ రాకింగ్ స్టార్‌ యశ్‌ కూడా అదే ఆశించాడు. తన లేటెస్ట్‌ మూవీ టాక్సిక్‌ మూవీ కోసం పీణ్యా-జనహళ్లి ప్రాంతంలో భారీ సెట్‌కి ప్లాన్ చేశారు. అనుకున్నట్టే శరవేగంగా రెండు రోజుల పాటు షూటింగ్ కూడా కంప్లిట్ చేశారు. అంతలోనే ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ వ్యవహారంపై ఆరాతీసిన అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. గతంలో.. ఇప్పుడున్న శాటిలైట్ చిత్రాలను పరిశీలించారు. ఒకప్పుడు పచ్చదనంతో కూడిన ప్రాంతం ఇప్పుడు మైదానంలా మారిపోయినట్టు గుర్తించారు. అంతేకాదూ షూటింగ్ స్పాట్‌కెళ్లి పరిశీలించారు కూడా. చెట్ల తొలగింపు ఆరోపణలపై దర్యాప్తుకి ఆదేశించామని.. నిజమని తేలితే బాధ్యులపై చర్యలుంటాయన్నారు మంత్రి ఈశ్వర్.

ఫారెస్ట్ భూముల్లో చెట్లు నరికివేశారన్న ఆరోపణల్ని టాక్సిక్ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్‌ ప్రొడక్షన్స్ కొట్టిపడేసింది. తమ సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది. షూట్ చేస్తున్నదంతా ప్రైవేట్ ప్లేస్‌ అని.. ఈ ఏడాది జనవరిలోనే షూటింగ్‌కి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామంది. తాము అటవీశాఖ నివేదిక కోసం ఎదురుచుస్తున్నామని.. తప్పుడు కేసులు పెడితే కోర్టులోనే సవాల్ చేస్తామని స్పష్టం చేసింది.

మొత్తం 599 ఎకరాల భూమిని ఇప్పటికే రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించారు అధికారులు. దానికి సంబంధించి గెజిట్ నోటిఫేకేషన్‌ కూడా రిలీజ్ అయింది. అయితే హెచ్‌ఏంటీ సంస్థ ప్రభుత్వ అనుమతులు లేకుండానే వేరే సంస్థలకు అమ్మేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలి ఉన్న భూమిలో షూటింగ్స్‌కి ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయన్నది తేలాల్సి ఉంది.

ప్రైవేట్‌ ల్యాండ్ అయినా ప్రభుత్వ భూమి అయినా చెట్లను నరికి వేశారన్న ఆరోపణల్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. అసలు అటవీశాఖ అధికారులు చెట్ల తొలగింపుపై పర్మిషన్ ఇచ్చారా? ఇస్తే ఎవరిచ్చారు? దీనిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది సిద్దరామయ్య సర్కార్‌. ప్రస్తుతానికి టాక్సిక్ మూవీ షూటింగ్ ఆగిపోయింది. సెట్‌ తీసేస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి పాన్ ఇండియా స్టార్‌.. పాన్ ఇండియా నరుకుడుతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.