SSMB 28: మహేష్ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర.. ఏ పాత్రలో తెలుసా ?..
ఇక ఇప్పుడు మహేష్ ..డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu).. ఈఏడాది సర్కారు వారి పాట చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మహేష్, కీర్తి జంటగా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి విదేశాల్లో వెకేషన్లో ఉన్నారు మహేష్. ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ ..డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ముందుగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం కాబోతుందంటూ మహేష్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. లేటేస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జూలై చివరి వారంలో ప్రారంభం కాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకపాత్రలో నటించబోతున్నాడని గతంలోనే వార్తలు వినిపించాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఉపేంద్ర ఇందులో మహేష్ తండ్రిగా కనిపించబోతున్నాడట. అయితే కేవలం ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉపేంద్ర పార్ట్ ఉంటుందని.. వీరిద్దరి కాంబోలో సీన్స్ ఉండవని తెలుస్తోంది. సన్ ఆఫ్ సత్యమూర్తి, గని వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉపేంద్ర ఇప్పుడు మరోసారి టాలీవుడ్ స్క్రీన్ పై అలరించనున్నాడు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.




