Kanguva Movie Review: కంగువ మూవీ రివ్యూ.. ఈసారి సూర్య హిట్టు కొట్టాడా.. ?

సూర్య హీరోగా శివ తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమా కంగువా. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి కండువా నిజంగానే ప్రేక్షకుల మనసు దోచిందా లేదా చూద్దాం..

Kanguva Movie Review: కంగువ మూవీ రివ్యూ.. ఈసారి సూర్య హిట్టు కొట్టాడా.. ?
Kanguva Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Nov 14, 2024 | 1:44 PM

మూవీ రివ్యూ: కంగువ

నటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

ఎడిటర్: నిశాద్ యూసుఫ్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్

దర్శకత్వం: శివ

సూర్య హీరోగా శివ తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమా కంగువా. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి కండువా నిజంగానే ప్రేక్షకుల మనసు దోచిందా లేదా చూద్దాం..

కథ:

ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్. పోలీసులు కూడా పట్టుకోవాలని కొంతమంది క్రిమినల్స్ ను వీళ్లు పట్టుకుంటారు. మరో బౌంటీ హంటర్ ఎంజెల్‌ (దిశా పటానీ)తో ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్ చేసుకుంటాడు. డబ్బు కోసం ఒప్పుకున్న పనులు చేసే ఫ్రాన్సిస్ కు ఒకసారి జెటా అనే అబ్బాయి కలుస్తాడు. అదే సమయంలో జెటాను ఓ ముఠా సభ్యులు చంపడానికి వెంటాడుతుంటారు. జెటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఫ్రాన్సిస్‌కు జెటాకు ఉన్న పునర్జన్మ సంబంధం ఏమిటి..? ఎందుకు ఆ కుర్రాడి కోసం ప్రాణం కూడా లెక్క చేయకుండా ఫ్రాన్సిస్ పోరాడతాడు..? మధ్యలో ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమ కోన, సాగర కోన మధ్య జాతి పోరాటం ఎందుకు జరిగింది అనేది మిగిలిన కథ..?

కథనం:

శరీరం మొత్తం మాస్ సినిమాలు చేసిన శివ తొలిసారి కంగువ అంటూ ఒక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పునర్జన్మల నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. 2024లో కథ మొదలై.. 1070కి షిఫ్ట్ అవుతుంది. ఈ రెండిటి మధ్య జరిగే కథ కంగువ. ఒక మంచి కథను తీసుకొని ఈ సినిమాను సెట్ చేసుకున్నాడు దర్శకుడు శివ. కానీ దాన్ని స్క్రీన్ మీదకు తీసుకురావడంలో కాస్త తడబడినట్టు అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలో కంగువ తిరుగులేదు. కానీ కీలకమైన ఎమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమా పూర్తిగా బెడిసి కొట్టింది. ఫస్ట్ ఆఫ్ తొలి అరగంట కథ ఎటు పోతుందో కూడా అర్థం కాదు. ఏదో ఫిల్లింగ్ కోసం సినిమా నడిపినట్టు అనిపిస్తుంది. కంగువ కథ మొదలైన తర్వాత కథలో కాస్త వేగం పెరిగింది. ఇంటర్వెల్ సీన్ వరకు బాగానే అనిపిస్తుంది. కీలకమైన సెకండాఫ్ మళ్లీ నెమ్మదిస్తుంది. ఒక కుర్రాడి చుట్టూ కథ తిరగడం బాగానే ఉన్నా.. అందులో ఎమోషన్ మిస్ అవ్వడం అంత బాగా అనిపించదు. రెండు జన్మలకు సంబంధించిన కాంప్లికేటెడ్ కథ తీసుకున్న కూడా దాన్ని అర్థమయ్యేలా జనరల్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు శివ. కాకపోతే మరీ రొటీన్ గా అనిపించడం.. నెమ్మదిగా సాగడంతో ఊహించిన కిక్ ఇవ్వడంలో విఫలమైంది ఈ సినిమా. సినిమా అంతా ఎలా ఉన్నా చివరి 40 నిమిషాలు మాత్రం అద్భుతంగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా రెండు కాలమానాలను బ్యాలెన్స్ చేస్తూ శివ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. సెకండాఫ్ ఈ సినిమాకు చాలావరకు ప్లస్ అయింది. క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ అద్భుతంగా ఉంది. సెకండ్ పార్ట్ లీడ్ కూడా చాలా బాగా ఇచ్చాడు దర్శకుడు శివ. ఓవరాల్ గా సూర్య కోసం వెళ్తే కంగువా నిరాశపరచదు.

నటీనటులు:

సూర్య గురించి కొత్తగా ఏం చెప్పాలి.. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చిన అద్భుతంగా చేస్తాడు. కంగువాలో కూడా రెండు పాత్రలలోనూ చాలా బాగా నటించాడు. దిశపటాని కేవలం పాట కోసం మాత్రమే ఉంది. బాబి డియోల్ విలనిజం చాలా క్రూరంగా ఉంది. మిగిలిన అన్ని పాత్రలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

కంగువ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం బాగానే ప్లస్ అయింది. ముఖ్యంగా నాయక పాట చాలా బాగుంది. ఆర్ఆర్ కూడా ఓకే. కాకపోతే చాలా చోట్ల లౌడ్ మ్యూజిక్ ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ వీక్. ఫస్ట్ ఆఫ్ శాల వరకు ల్యాగ్ సీన్స్ అనిపించాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. త్రీడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. దర్శకుడు శివ తీసుకున్న కథ బాగానే ఉన్నా.. తీసిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను తీశారు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా కంగువ.. అంతగా ఆకట్టుకొని పీరియడ్ యాక్షన్ డ్రామా..

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.