- Telugu News Photo Gallery Cinema photos Was this reason for Pushpa 2 makers to take Sreeleela for special song
Sreeleela: పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం అందుకే శ్రీలీలను తీసుకున్నారా..? అసలు విషయం ఇది..
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. గత వారం రోజులుగా పుష్ప 2 స్పెషల్ సాంగ్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా ఇదే విషయంపై మరో క్రేజీ న్యూస్ వైరలవుతుంది.
Updated on: Nov 14, 2024 | 4:07 PM

2021లో భారీ అంచనాల మధ్య విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా పుష్ప ది రైజ్. ఇందులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. భారీ వసూళ్లు రాబట్టింది.

లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే సినిమాలు కాస్త పలచనవడంతో ఇలా పొటో షూట్ల మీద పడ్డారని అంటున్నవారూ లేకపోలేదు. ఎవరేమనుకుంటే మనకేంటి.. డిసెంబర్ 5న కిస్సిక్ సాంగ్ చాలు..

ఊ అంటావా మావ పాట తర్వాత ఇప్పుడు మరోసారి పుష్ప 2లోనూ స్పెషల్ సాంగ్ ఉండడంతో మరింత బజ్ ఏర్పడింది. మొదటి నుంచి ఈ పాటలో కనిపించే ముద్దుగుమ్మ ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. చివరకు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల సెలక్ట్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ ముందుగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వద్దకు వెళ్లిందట. అయితే కిస్సింగ్ సాంగ్ కోసం బీటౌన్ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పుష్ప 2 స్పెషల్ పాటలో శ్రద్ధాను చూడాలనుకున్న మేకర్స్ కు నిరాశే ఎదురయ్యింది.

దీంతో ఆమె కాకుండా కిస్సింగ్ సాంగ్ కోసం శ్రీలీలను ఎంపిక చేశారట డైరెక్టర్ సుకుమార్.




