Indian 2 Movie: భారతీయుడు ఈజ్ బ్యాక్ .. లంచగొండితనంపై పోరాటం.. ‘భారతీయుడు 2’ ఇంట్రో గ్లింప్స్ అదుర్స్..
కమల్, శంకర్ కాంబినేషన్‌లో 1996లో విడుదలైన ఇండియన్ (భారతీయుడు) సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భారతీయుడు 2’ రూపొందిస్తున్నారు శంకర్. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కానీ సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా చాలారోజులపాటు ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటిని కలిగించగా.. శుక్రవారం సాయంత్రం ఈ మూవీ ఇంట్రో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘భారతీయుడు 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కమల్, శంకర్ కాంబినేషన్‌లో 1996లో విడుదలైన ఇండియన్ (భారతీయుడు) సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భారతీయుడు 2’ రూపొందిస్తున్నారు శంకర్. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కానీ సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా చాలారోజులపాటు ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటిని కలిగించగా.. శుక్రవారం సాయంత్రం ఈ మూవీ ఇంట్రో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు.
ఇక గ్లింప్స్ విషయానికి వస్తే.. గతంలో సూపర్ హిట్ అయిన ‘భారతీయుడు’లో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన వీరశేఖరన్ సేనాపతి ఇండియాలో మళ్లీ తప్పు జరిగితే తాను తిరిగి వస్తానని చెప్పటంతో కథ ముగిసింది. అయితే ఇప్పుడు మళ్లీ దేశంలో లంచగొండితనం పెరిగిపోతోంది. లంచం తీసుకోకుండా ఏ అధికారు పని చేయడం లేదు. దీంతో సామాన్యులు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశంలో లంచం తీసుకోవడం పెరగడంతో.. ఆ సమయంలో అందరూ భారతీయులు కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తూ.. దేశంలోకి భారతీయుడు తిరిగి అడుగు పెట్టాలని రిక్వెస్టులు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి అడుగు పెడతారు. తిరిగి వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు.. భారతీయుడుకి భయపడి లంచాలు మానేసిన అధికారులు మళ్లీ లంచాలు తీసుకోవటానికి కారణం ఎవరు? అనే విషయాలను ఈ గ్లింప్స్‌లో చాలా గ్రాండియర్‌గా చూపించారు డైరెక్టర్ శంకర్. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది.
Namaste India 🇮🇳 BHARATEEYUDU IS BACK…
Presenting BHARATEEYUDU-2 AN INTRO… https://t.co/mXaXnoiDtp#Bharateeyudu2 @ikamalhaasan @shankarshanmugh@LycaProductions #Indian2
— rajamouli ss (@ssrajamouli) November 3, 2023
తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా కనిపించారు. భారతీయుడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన శంకర్..ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ఎలాంటి సెన్సేషన్స్ తెర తీయబోతున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.