Bigg Boss 7 Telugu: శోభా కోసం రాక్షసంగా మారిన అమర్ దీప్.. భోలే, అశ్వినిపై అటాక్.. అల్లాడిపోయిన శివాజీ..
ఇప్పటివరకు జరిగిన అన్ని గేమ్స్ లో వీరసింహాలు టీమ్ గెలిచింది. దీంతో వారు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. అయితే వీరిలో కెప్టెన్ అయ్యేందుకు మరో టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. వీరసింహాలు టీమ్ సభ్యుల తరపున గర్జించే పులుల టీమ్ ఆడుతుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ ఫోటో ఉన్న బ్యాగ్ ను అపోజిట్ టీమ్ సభ్యులు తగిలించుకోవాలి. ఒక్కో రౌండ్ ముగిసేసరికి ఎవరి బ్యాగ్ తక్కువగా ఉండే వారు రేసు నుంచి ఔట్ అవుతారు. ఇందులో భాగంగా శోభా ఫోటో ఉన్న బ్యాగ్ ను అమర్ తీసుకున్నాడు. ఇక తేజ బ్యాగ్ ప్రియాంక, రతిక బ్యాగ్ భోలే, అర్జున్ బ్యాగ్ శివాజీ, గౌతమ్ బ్యా్గ్ అశ్విని తీసుకున్నారు.

ఎలాగైనా గేమ్ గెలిచేయ్యాలి. సరైనా దారిలోనే వెళ్లాలని లేదు. అవసరమైతో ఫౌల్ గేమ్ అయిన ఆడాలి. ఇలా ఆడి మొదటి వారం నుంచి నాగార్జునతో చివాట్లు తింటున్నాడు అమర్ దీప్. అయినా మళ్లీ మళ్లీ పొరపాట్లు చేస్తునే ఉన్నాడు. కానీ గత రెండు వారాలుగా మాత్రం టాస్కులలో పర్ఫామెన్స్ సూపర్ అనిపించుకున్నాడు. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం పిచ్చిపట్టినట్లుగా బిహేవ్ చేశాడు. శోభాను కెప్టెన్ చేసేందుకు మరింత రాక్షసంగా మారాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఇప్పటివరకు జరిగిన అన్ని గేమ్స్ లో వీరసింహాలు టీమ్ గెలిచింది. దీంతో వారు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. అయితే వీరిలో కెప్టెన్ అయ్యేందుకు మరో టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. వీరసింహాలు టీమ్ సభ్యుల తరపున గర్జించే పులుల టీమ్ ఆడుతుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ ఫోటో ఉన్న బ్యాగ్ ను అపోజిట్ టీమ్ సభ్యులు తగిలించుకోవాలి. ఒక్కో రౌండ్ ముగిసేసరికి ఎవరి బ్యాగ్ తక్కువగా ఉండే వారు రేసు నుంచి ఔట్ అవుతారు. ఇందులో భాగంగా శోభా ఫోటో ఉన్న బ్యాగ్ ను అమర్ తీసుకున్నాడు. ఇక తేజ బ్యాగ్ ప్రియాంక, రతిక బ్యాగ్ భోలే, అర్జున్ బ్యాగ్ శివాజీ, గౌతమ్ బ్యా్గ్ అశ్విని తీసుకున్నారు.
ఇక గేమ్ స్టార్ట్ కాగానే అమర్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించాడు. తన తోటి కంటెస్టెంట్స్ మీదకి ఫిజికల్ అయ్యాడు. భోలేను చొక్కా పట్టుకుని.. మెడ పట్టుకుని లాగేశాడు. అలాగే అశ్వినితో ప్రవర్తించగా.. ఆమె గట్టిగానే ఎదురుతిరిగింది. ఇక అదే సమయంలో అదిరా అలా ఆడు అంటూ మరింత రెచ్చగొట్టింది శోభా. ఇక ముందు రౌండ్ లో అశ్విని ఔట్ కాగా.. గౌతమ్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఇక భోలే మెడ పట్టుకుని లాగేశాడు అమర్. ఫిజికల్ అవుతుందని మిగతా కంటెస్టెంట్స్ అరిచినా.. నా ఇష్టం ఇలాగే చేస్తా అంటూ గట్టిగా అరిచాడు. ఇక మధ్యలో రతిక వచ్చి సంచాలక్ ప్రశాంత్‌తో మాట్లాడుతుండగా.. మరింత రెచ్చిపోయి ప్రవర్తించాడు అమర్. ఇక ఆ తర్వాత రెండో రౌండ్ లో భోలే ఔట్ కాగా.. చివరకు శివాజీ, ప్రియాంక, అమర్ మిగిలారు. ఇక వెంటనే శివాజీపై ఫిజికల్ అటాక్ చేశాడు అమర్. భూజాన ఉన్న బ్యాగ్ లాగేయ్యడంతో శివాజీ నొప్పితో అల్లాడిపోయాడు. వెంటనే అతడిని మెడికల్ ఎమర్జెన్సీ కోసం తీసుకెళ్లగా.. అర్జున్ కెప్టెన్సీ రేసు నుంచి ఔట్ అయ్యాడు.
View this post on Instagram
ఇక ఆ తర్వాత కెప్టెన్సీ రేసులో ప్రియాంక, అమర్ మాత్రమే మిగిలారు. దీంతో ప్రియాంకపై రెచ్చిపోయాడు. ఆమె చేతిలోని బ్యాగ్ లాగేసేందుకు పిచ్చిపట్లిగా ప్రవర్తించాడు. చివరకు ప్రియాంక సైతం ఔట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి శోభాను కెప్టెన్ చేయడం కోసం అమర్ దీప్ మాత్రం రాక్షసంగా మారినట్లు ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.