OTT Movie: ఎట్టకేలకు ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం.. 300 కోట్ల సినిమా స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన
కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. థియేటర్లలో చూసిన వారిలో చాలామంది కూడా ఈ సినిమాను మళ్లీ ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది.

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి సినిమాలు. ఈ మధ్యన మరీ మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అదే సమయంలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు మాత్రం ఓటీటీలోకి వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటున్నాయి. 45, 60 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టార్ క్యాస్టింగ్ లేకున్నా, చిన్న సినిమా ట్యాగ్ తోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. స్టార్ హీరోల సినిమాలను వెనక్కు నెడుతూ రికార్డు వసూళ్లు రాబట్టింది. హాలీవుడ్ సినిమాలను తలపించే ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అబ్బుర పరిచే యాక్షన్ సీన్స్, ఊహించని ట్విస్టులు సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందజేసిన ఈ సినిమాను ఓటీటీలోకి చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరి నిరీక్షణకు తెరపడింది. మరికొన్ని రోజుల్లో ఈ బాక్సాఫీస్ సంచలనం ఓటీటీలోకి రానుంది. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లోక ఛాప్టర్ 1 -చంద్ర’. తెలుగులో కొత్త లోకగా విడుదలైంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సూపర్ హీరో మూవీలో స్లేన్, డాన్స్ మాస్టర్ శాండీ, విజయరాఘవన్, సంధు సలీంకుమార్, రఘునంద పలేరి, శివాజిత్ పద్మనాభన్, జైన్ ఆండ్రూస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, షౌబిన్ అతిథి పాత్రల్లో మెరిశారు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. తాజాగా కొత్త లోక స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. అక్టోబర్ 31 నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు జియో హాట్ స్టార్ ప్రకటించింది.
అక్టోబర్ 31 నుంచి జియో హాట్ స్టార్ లో..
The world of Lokah unfolds exclusively on JioHotstar, streaming from October 31st.@DQsWayfarerFilm @dulQuer @kalyanipriyan @naslen__ @NimishRavi @SanthyBee#LokahOnJioHotstar #LokahUniverse #YakshiReturns #LokahChapter1 #Wayfarerfilms #DulquerSalmaan #DominicArun… pic.twitter.com/Va3c6PGttC
— JioHotstar Malayalam (@JioHotstarMal) October 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








