Kalpika : కల్పిక కేసులో మరో ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి..
ఎక్కడికి వెళ్లినా హంగామా సృష్టిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సినీ నటి కల్పిక గణేష్‌పై ఆమె తండ్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా కల్పిక మానసిక స్థితి బాగలేదని, డిప్రెషన్‌తో బాధపడుతుందని ఫిర్యాదులో రాశారు. తరచూ అందరితో గొడవలు పడుతూ కుటుంబ సభ్యులకు ప్రమాదంగా మారుతుందన్నారు.

సినీనటి కల్పిక పేరు ఈమధ్యకాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గతంలో ప్రిజమ్ పబ్‌లో ఆమె ప్రవర్తించిన తీరు కేసుల వరకు వెళ్లింది. పబ్ సిబ్బందిపై దుర్బాషలు ఆడుతూ ఆమె చేసిన రాద్ధాంతం నెట్టింట వైరల్ అయింది. ఇక ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్‌లోనూ ఆమె అలాగే ప్రవర్తించింది. రిసార్ట్ మేనేజర్‌తో పాటు సిబ్బందిపైనా బూతులు తిడుతూ రచ్చ రచ్చ చేసింది. అసలు ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియక అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారు. ఆమె ప్రవర్తన చూస్తే మానసిక పరిస్థితి బాగోలేదని కామెంట్స్ చేశారు చాలా మంది. ఇక ఇప్పుడు తండ్రి కూడా అదే విషయంతో ఆమె పై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..
తాజాగా కల్పిక తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెకు మెంటల్ డిజార్డర్ ఉందని.. ఆమె వల్ల కుటుంబసభ్యులకు, ప్రజలకు ప్రమాదముందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని తెలిపారు. కల్పిక రెండేళ్లుగా మెడిసిన్ ఆపేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. అందుకే ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఫిర్యాదులో తెలిపారు.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
తన కూతురు చేసే పనులతో కుటుంబానికి సంబంధం లేదని వెల్లడించారు. తన కూతురిని తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కల్పిక గురించి స్వయంగా తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..








