AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: సూపర్ స్టైలిష్ లుక్‏లో యంగ్ టైగర్.. నయా లుక్ చూసి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..

తాజాగా తారక్ లేటేస్ట్ సూపర్ స్టైలీష్ లుక్ నెట్టింట వైరలవుతుంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తారక్ సూపర్ స్టైలీష్ గా ప్రిపేర్ చేయగా.. ఓ మిర్రర్ పిక్ తీశాడు. ఇందులో తారక్ స్మార్ట్ అండ్ కూల్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఇది ఓ యాడ్ కోసం రెడీ చేసిన లుక్ కాగా.. రీసెంట్ గా ఈ మేకోవర్ లోకి మారినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుండగా.. తారక్ న్యూ స్టైలీష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Jr.NTR: సూపర్ స్టైలిష్ లుక్‏లో యంగ్ టైగర్.. నయా లుక్ చూసి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..
Jr.ntr New Pic
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2023 | 7:24 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. ఇప్పుడు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో సినిమా ఏరెంజ్‏లో ఉంటుందో చెప్పేశారు. ఈ సినిమాపై గ్లోబల్ లెవల్ హైప్ రాగా.. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. తారక్ సరసన నటించేందుకు ఈ బ్యూటీ దాదాపు ఏడాది కాలం వెయిట్ చేసిందట. అంతేకాకుండా తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని.. దేవర సినిమా అనౌన్స్ చేసిన రోజునే ఈ సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండు అని నిత్యం ప్రార్థించినట్లు చెప్పుకొచ్చింది జాన్వీ. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు.. తారక్.. మరోవైపు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా తారక్ లేటేస్ట్ సూపర్ స్టైలీష్ లుక్ నెట్టింట వైరలవుతుంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తారక్ సూపర్ స్టైలీష్ గా ప్రిపేర్ చేయగా.. ఓ మిర్రర్ పిక్ తీశాడు. ఇందులో తారక్ స్మార్ట్ అండ్ కూల్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఇది ఓ యాడ్ కోసం రెడీ చేసిన లుక్ కాగా.. రీసెంట్ గా ఈ మేకోవర్ లోకి మారినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుండగా.. తారక్ న్యూ స్టైలీష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. దేవర సినిమా తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రాగా.. ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరోవైపు నీల్ సలార్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాతే నీల్.. తారక్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.