Jr NTR: భార్యను ప్రేమగా హృదయానికి హత్తుకున్న తారక్.. వైరల్ అవుతున్న రొమాంటిక్ పిక్
ఇతర దేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు తారక్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయంతెలిసిందే. ఇప్పటికి ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కంటిన్యూ అవుతోంది. ఇతర దేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు తారక్. సినిమా షూటింగ్స్ మధ్య గ్యాప్ దొరికితే ఫ్యామిలీకి టైం కేటాయిస్తారు తారక్. ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. పిల్లలు, భార్యతో కలిసి విదేశాల్లో విహరిస్తూ ఉంటారు యంగ్ టైగర్. మొన్నామధ్య ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం భార్య ప్రణతితో కలిసి జపాన్ వెళ్ళాడు. ఇక ఇప్పుడు యూఎస్ వెళ్ళాడు తారక్. తాజాగా తారక్ ప్రణీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మియామీ బీచ్ హోటల్ లో భార్య లక్ష్మీ ప్రణతిని హత్తుకుంటున్న ఫోటో షేర్ చేశారు తారక్. ఈ ఫొటోలో ఎన్టీఆర్ బ్లర్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ ఫోటోలను తారక్ పిల్లలు తీసి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటో అతని పెద్ద కొడుకు భార్గవ్ రామ్ తీసినట్టు ఉన్నాడు. అందుకే బ్లర్ గా వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.




ఇక ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తోన్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




