AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 Pages : అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన 18 పేజెస్.. ప్రీ రిలీజ్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో

ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి జతకట్టారు. నిఖిల్ అనుపమ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 18పేజెస్.

18 Pages : అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన 18 పేజెస్.. ప్రీ రిలీజ్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో
18 Pages
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2022 | 11:20 AM

Share

యంగ్ హీరో నిఖిల్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవలే కార్తికేయ2 సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న సినిమా వచ్చినప్పటికీ కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి జతకట్టారు. నిఖిల్ అనుపమ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 18పేజెస్. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ నెల 19న 18పేజెస్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నివహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ విషయాన్నీ అనౌన్స్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

అలాగే ఈ చిత్ర యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా క్రేజి వీడియోలను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. కంప్లీట్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ