AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ఎన్టీఆర్ ఐడీ కార్డు మీరెప్పుడైనా చుశారా ? వేసుకోవడం ఇదే మొదటి సారి అంటున్న యంగ్ టైగర్.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్

Jr.NTR: ఎన్టీఆర్ ఐడీ కార్డు మీరెప్పుడైనా చుశారా ? వేసుకోవడం ఇదే మొదటి సారి అంటున్న యంగ్ టైగర్.. ఫోటోస్ వైరల్..
rrr Id Card
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2021 | 7:20 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎన్నో రోజులుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన దోస్తీ ప్రమోషన్ సాంగ్‍ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతునే ఉంటుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‏తోపాటు.. ఒలివియా మోరీస్ కూడా హీరోయిన్స్‏గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‏గణ్ కీలక పాత్రలో కనిపించనున్నండగా.. హాలీవుడ్ యాక్టర్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఎన్టీఆర్ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత మెడలో ఐడీ కార్డు ధరించాను.. సెట్స్ పై ఉన్నప్పుడు ఐడీ కార్డు వేసుకోవడం ఇదే మొదటి సారి అంటూ తన ఇన్‍స్టా ఖాతాలో షేర్ చేశాడు తారక్. మెడలో ఆర్ఆర్ఆర్ ఐడీ కార్డు ధరించగా.. అందులో ఎన్టీఆర్ పేరు నందమూరి తారక రామారావు అని ఉండగా.. పైన చిత్రనిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‏టైన్మెంట్ అని ఉంది. ఎన్టీఆర్ వెనకాలే దర్శకధీరుడు రాజమౌళి కూడా కుర్చోని ఉన్నారు. జక్కన్న కూడా ఐడీ కార్డు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఉక్రెయిన్‏లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజు పాత్రలో నిటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

Also Read: Prabhudheva : ఛాలెంజింగ్‌ రోల్‌‌‌‌లో నటిస్తున్న ఇండియన్ మైకేల్ జాక్సన్‌‌‌.. ఆకట్టుకుంటున్న ప్రభుదేవా మూవీ ఫస్ట్‌‌‌లుక్ పోస్టర్..

Anasuya Bharadwaj : డిఫరెంట్ గెటప్‌‌‌లో బుల్లితెర బ్యూటీ.. ‘పుష్ప’ షూటింగ్ నుంచి లీకైన అనసూయ లుక్..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు