Prabhudheva : ఛాలెంజింగ్‌ రోల్‌‌‌‌లో నటిస్తున్న ఇండియన్ మైకేల్ జాక్సన్‌‌‌.. ఆకట్టుకుంటున్న ప్రభుదేవా మూవీ ఫస్ట్‌‌‌లుక్ పోస్టర్..

కొరియోగ్రాఫర్‌‌‌గా, హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా. అభిమానులంతా ఆయనను ఇండియన్ మైకేల్ జాక్సన్‌‌‌గా పిలుస్తూ ఉంటారు.

Prabhudheva : ఛాలెంజింగ్‌ రోల్‌‌‌‌లో నటిస్తున్న ఇండియన్ మైకేల్ జాక్సన్‌‌‌.. ఆకట్టుకుంటున్న ప్రభుదేవా మూవీ ఫస్ట్‌‌‌లుక్ పోస్టర్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2021 | 7:28 PM

Prabhudheva : కొరియోగ్రాఫర్‌‌‌గా, హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా. అభిమానులంతా ఆయనను ఇండియన్ మైకేల్ జాక్సన్‌‌‌గా పిలుస్తూ ఉంటారు. ఇక డ్యాన్స్‌‌‌ల్లో ఏ రేంజ్‌‌‌‌లో దుమ్మురేపుతాడో హీరోగానూ.. అదే రేంజ్‌‌‌‌లో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభుదేవా. ఈ సినిమాలో ఓ ఛాలెంజింగ్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడు ఈ ఇండియన్ మైకేల్ జాక్సన్. తాజాగా ‘పోయిక్కల్ కుతిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభుదేవా. సంతోష్ జయకుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ‘హరహర మహాదేవకి’, ‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’, ‘గజినీకాంత్‌’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు సంతోష్. తాజాగా ‘పోయిక్కల్ కుతిరాయ్’ సినిమాకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌‌‌లో ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తున్నాడు. ఒక చేత్తో ఒక పాపను ఎత్తుకుని ఉన్న ఆయన, మరో చేత్తో  ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోణంలో తెరకెక్కిస్తుండగా మినీ స్టూడియో, డార్క్‌ రూమ్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బిగ్‌బాస్‌ ఫేం రైజా విల్సన్‌ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ముఖ్యమైన పాత్రల్లో ప్రకాష్ రాజ్, సముద్రఖని నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : Suriya’s ‘Jai Bhim’: మరో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిన సూర్య.. త్వరలోనే స్ట్రీమింగ్

Orey Bamardhi: అసలీ బావ, బామ్మర్దిల మధ్య గొడవేంటి.? ఆసక్తికరంగా ఒరేయ్‌ బామ్మర్ది సినిమా ట్రైలర్‌..

‘బందిపోటు’ సినిమాకు 33 ఏళ్లు.. ఆ సినిమాతోనే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టానన్న సుమన్