Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం.. అచ్చతెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు.. రూ.10 రెమ్యునరేష్‌తో కెరీర్ మొదలు..
జయప్రద 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. వాస్తవానికి జయప్రద చిన్నతనంలో డాక్టర్ కావాలని కల కంది. అయితే 14 ఏళ్ల వయసులో పాఠశాలలో జయప్రద నాట్య ప్రదర్శన చూసిన సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
అందం, అభినయంతో సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అచ్చ తెలుగు అమ్మాయి జయప్రద. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి.. అక్కడ కూడా సత్తా చాటిన అందాల సుందరి జయప్రద ఈరోజు తన 61వ పుట్టినరోజు జరుపుకుంటుంది. హీరో యిన్ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టిన జయప్రద అక్కడ కూడా విజయకేతనాన్ని ఎగురవేసింది. సినీ పరిశ్రమలో అందాల నటీమణుల జాబితాలో జయప్రద పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. ఓ చిన్న నటిగా పరిశ్రమలో అడుగు పెట్టిన జయప్రద తన కృషి, పట్టుదల, నటనతో ఏళ్ల తరబడి సినీ ప్రేక్షకుల హృదయాలను రాణిగా ఏలింది.
జయప్రద సినీ ప్రస్థానంలో ఆరు భాషలలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి 300కు పైగా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి దక్షిణాది స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ , జితేంద్ర, వినోద్ ఖన్నా వంటి అనేక మంది బాలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టింది. ఒకప్పుడు సినిమా నిర్మాతల మొదటి ఎంపిక జయప్రదే అంటే అతిశయోక్తి కాదు. జయ తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి కూడా. అయితే జయప్రద తన మొదటి సినిమాకు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇచ్చారు.
జయప్రద 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. వాస్తవానికి జయప్రద చిన్నతనంలో డాక్టర్ కావాలని కల కంది. అయితే 14 ఏళ్ల వయసులో పాఠశాలలో జయప్రద నాట్య ప్రదర్శన చూసిన సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ సినిమాలో లలిత కుమారి జయప్రదంగా మారి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో ఒక పాటతో వెండి తెరపై అడుగు పెట్టింది. ఈ సాంగ్ లో డ్యాన్స్ చేసిన జయప్రదకు రెమ్యునరేషన్ గా రూ. 10 లు ఇచ్చారు.
అనంతరం జయప్రద అనేక దక్షిణాది సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. సిరిసిరి మువ్వ, అంతులేని కథ, సింహాసనం, అడవిరాముడు, సీతాకళ్యాణం వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 1979లో జయ తొలిసారి సర్గం చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. హిందీలో జయ నటించిన తొలి సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అదృష్ట తలుపులు తెరుచుకున్నాయి అనంతరం అనేక సినిమా ఆఫర్లు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.
జయప్రద క్రమంగా రాజకీయాల వైపు అడుగులు వేసింది. 1994 అక్టోబర్ 10 న టీడీపీలో జాయిన్ అయింది. 1996 ఏప్రిల్ లో టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. అనంతరం సమాజ్ వాదీ పార్టీలో చేరిన జయప్రద రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..