Kollywood to Tollywood: టాలీవుడ్‌కు క్యూకడుతున్న కోలివుడ్ స్టార్ హీరోలు..
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ నాలు మూలాల వ్యాపిస్తుంది. టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అన్నీ ఇండస్ట్రీల హీరోలు తెలుగులో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Kollywood to Tollywood: తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ నాలు మూలాల వ్యాపిస్తుంది. టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అన్నీ ఇండస్ట్రీల హీరోలు తెలుగులో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ ఇలా అన్ని వుడ్ లనుంచి హీరోలు తెలుగు సినిమాల పై కన్నేస్తున్నారు. తెలుగు సినిమాలని ఇంతకు ముందు తమ తమ భాషల్లో రీమేక్ చేసిన హీరోలు. ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలే చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కన్నడ నుంచి సుధీప్ విలన్ అవతరమెత్తి ఈగ సినిమా చేశాడు. దాంతో అతడికి ఇక్కడ మంచి క్రేజ్ లభించింది. ఆతర్వాత తమిళ్ హీరోలు కూడా ఇప్పుడు తెలుగు సినిమాల వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరో ధనుష్ మన దర్శకులతో సినిమాలు కమిట్ అయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా లైన్ చేశాడు. ఇక దళపతి విజయ్ కూడా వంశీ పైడిపల్లి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మరో వైపు సూర్య, కార్తీ లుకూడా తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో తెలుగులో సినిమాను కన్ఫామ్ చేసేసాడు. శివ కార్తికేయన్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ నిర్మాణంలో దర్శకుడు అనుదీప్ కేవి తమిళ, తెలుగు ద్విభాష చిత్రం అనౌన్స్ మెంట్ చేశారు. విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. న్యూ ఇయర్ సందర్భంగా శివ కార్తికేయన్ తో తెలుగు తమిళ ద్విభాష చిత్రాన్ని అనౌన్స్ చేశారు నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, సురేష్ బాబు. శివ కార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.
జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు అనుదీప్ కేవి రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా మూవీ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోకు మంచి ఫామ్ లో ఉన్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. యూకే లోని లండన్ మన దేశంలోని పాండిచ్చేరి నేపథ్యంగా కథ సాగనుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్న ఎస్కే 20 రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. త్వరలో నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు. మరి మన దర్శకులు ఈ కోలీవుడ్ స్టార్స్ కు ఎలాంటి హిట్స్ ఇస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..