Aa Ammayi Gurinchi Meeku Cheppali: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్

టాలీవుడ్ లో అందమైన ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

Aa Ammayi Gurinchi Meeku Cheppali: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్
Kruthi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 01, 2022 | 6:33 PM

Aa Ammayi Gurinchi Meeku Cheppali: టాలీవుడ్‌లో అందమైన ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఇంద్రగంటి. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ బాబుతో కలిసి సినిమాకి చేస్తున్నారు మోహన్ కృష్ణ. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఇక ఇప్పుడు మరో అందమైన ప్రేమ కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో.. బెంచ్ మార్క్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.  సినిమాకు నిర్మాణ‌ భాగస్వామిగా మైత్రీ మూవీమేకర్స్ వ్యవహరిస్తోంది. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ను ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు నిర్మాణ భాగ‌స్వామిగా ఆహ్వానించడం గర్వంగా ఉందని మెంచ్ మార్క్ స్టూడియోస్ ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. గతంలో సమ్మోహనం లాంటి ప్రేమ కథతో మెప్పించిన ఇంద్రగంటి.. ఇప్పుడు కూడా అలాంటి కథనే సినిమాకోసం రాసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఆ లైవ్ ఇక్కడ చూడండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..