Anand Deverakonda’s Highway: ఆసక్తి రేపుతున్న ఆనంద్ దేవరకొండ మూవీ న్యూ ఇయర్ పోస్టర్..
దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో.

Anand Deverakonda: దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ కుర్ర హీరో. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆనంద్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత రీసెంట్ గా పుష్పక విమానం సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కుర్ర హీరో ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత వెంకట్ తలారి.
న్యూ ఇయర్ సందర్భంగా `హైవే`చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ పక్కన ఇతర క్యారెక్టర్స్ ను చూపించారు. కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు `హైవే`మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..




