AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: అతడిని క్షమించకూడదు.. ఆ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే.. జాన్వీ కపూర్ సీరియస్ పోస్ట్..

బాలీవుడ్ జాన్వీ కపూర్ ఇప్పుడు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే దేవర సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పెద్ది చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో తాజాగా జాన్వీ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.

Janhvi Kapoor: అతడిని క్షమించకూడదు.. ఆ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే.. జాన్వీ కపూర్ సీరియస్ పోస్ట్..
Janvhi Kapoor
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2025 | 11:05 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జాన్వీ.. ఇప్పుడు రామ్ చరణ్ జోడిగా పెద్ది చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా జాన్వీ కపూర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన ఘటనపై జాన్వీ రియాక్ట్ అయ్యింది. అతడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతడిని ఎప్పటికీ క్షమించకూడదని రాసుకొచ్చారు.

“ఇలాంటి ప్రవర్తన సరైందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు ? ఎదుటివాళ్లపై చేయి ఎలా వేస్తారు. ? మానవత్వం లేకుండా చేసిన ఈ పనిపై కనీసం పశ్చాత్తాపం, అపరాధభావం ఉండదా.. ? ఇలాంటి మీ ప్రవర్తన చూసి ఎవరైనా మీతో కలిసి ఉండాలనుకుంటారా..? ఇది చాలా అవమానకర చర్య. ఇలాంటి ప్రవర్తనను మనం ఎప్పటికీ క్షమించకూడదు. ఈ ఘటనను ఖండించి అతడిని శిక్షించకపోతే అది మనకే సిగ్గుచేటు. ఈ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే ” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఘటన విషయానికి వస్తే.. ఠాణె జిల్లాలోని శ్రీబాల చికిత్సాలయంలో సోమవారం ఓ వ్యక్తి తన బిడ్డను డాక్టర్ కు చూపించేందుకు క్యూ పద్దతి పాటించకుండా ముందుకు వెళ్లేందుకు ట్రై చేశాడు. దీంతో రిసెప్షనిస్ట్ అతడిని అడ్డుకుని అపాయింట్ మెంట్ లేకపోతే లైనులో రావాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను కాలితో తన్నడమే కాకుండా జుట్టు పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..