Mega Family: మెగా ఫ్యాన్స్- అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య అంతరం పెరిగిందా?
రీల్ వేరు రియల్ లైఫ్ వేరు. అసలు ఫ్యాక్స్ సంగతి ఏమో కానీ.. ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్ చేరుకుంది. మరి నిజంగానే మెగా ఫ్యాన్స్- బన్నీ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందా?..సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ కొనసాగుతోన్న టైమ్‌లో.. లోకల్ మీడియాలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మెగా కాంపౌండ్ అంటే ఒక కుటుంబం. కానీ ఇదే మాట..ఇదే బాటగా వుండే ఫ్యాన్స్ టోన్ మారిందా? మెగా ఫ్యాన్స్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఎన్నికల ముందు వరకు ఓ లెక్క. ఆ తరువాత లెక్క మారిందా? అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు. కానీ ఎన్నికల తరువాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కొన్నాళ్లుగా రీసౌండ్ ఇస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మధ్య పోరు పాలిటిక్స్‌కు పాకింది. ఇటూ అటూ డైలాగులు పేలుతున్నాయి. మెగా ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మధ్య గ్యాప్ పెరగడం నిజమేనా?అనే చర్చ జరుగుతోన్న టైమ్‌లో బెంగళూరులో పవన్ చేసిన కామెంట్స్‌ను సైతం ఫ్యాన్స్ వార్‌లోకి లాగేశారు.<
సినిమాల్లో హీరో క్యారెక్టర్ ట్రెండ్ ఎలా మారుతూ వస్తోందో బెంగళూరు జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్ చేశారు పవన్. అల్లూ అర్జున్‌ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలను చేశారని బన్నీ ఫ్యాన్స్ హార్టయ్యారు. ఔనా..కాదా? అనేది పవన్ కల్యాణే క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇక ఈ సీక్వెన్స్‌లోనే మారుతీ సుబ్రమణ్యం మూవీ ఫంక్షన్‌లో ..నాకు నచ్చితే ఎక్కడికైనా..ఎందాకైన వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కేంద్రంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్ మరింత రాజుకుంది.
ఇలా ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతుండగానే కాంట్రవర్సీ ఫ్రేమ్‌లోకి లేటెస్ట్‌గా పొలిటికల్ రాకెట్ దూసుకు వచ్చింది. తనకు మెగా ఫ్యాన్స్ వున్నారని తెలుసు కానీ అల్లు ఫ్యాన్స్ తెలియదని వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు బొలిశెట్టి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచింది. తమకు అల్లు అర్జున్ సపోర్ట్ ఏం అవసరమన్నారు. ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసన్నారు. గతంలోనూ వాళ్ల నాన్ననే ఆయన గెలిపించుకోలేకపోయారన్నారు. అసలే ఫ్యాన్స్ వార్ కాక మీదున్న టైమ్‌లో బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అభిమానుల మధ్య ముదురుతోన్న సోషల్ మీడియా వార్.. తాజా పరిమణాల నేపథ్యంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే చర్చ ఇప్పుడు జోరందుకుంది.



