Suriya: హీరో సూర్యకు ఊరట.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశం..
డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో

తమిళ్ స్టార్ సూర్యకు (Suriya), డైరెక్టర్ టీజే జ్ఞానవేల్కు ఊరటనిచ్చింది మద్రాసు హైకోర్టు. వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశఇంచింది. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి స్పందన లభించింది. దర్శకత్వం, సూర్య నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే జైభీమ్ సినిమాలో వన్నియార్ సంఘాన్ని తక్కువ చేస్తూ చూపించారని హీరో సూర్య, డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ జ్యోతికపై వన్నియార్ సంఘం ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై జూలై 18న విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు తదపరి విచారణ వరకు హీరో, డైరెక్టర్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకొద్దని ఆదేశించింది.
ఈ కేసులో సూర్య, జ్ఞానవేల్, జ్యోతికలను జూలై 21న కోర్టు విచారించనుంది. అప్పటివరకు వారిపై.. జైభీమ్ చిత్రయూనిట్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని జస్టిస్ సతీష్ కుమార్ ఆదేశించారు. జైభీమ్ చిత్రంలో వన్నియార్ సంఘాన్ని తక్కువ చేస్తూ చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వన్నియార్ సంఘం సభ్యులు.. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.




జైభీమ్ సినిమాలో అగ్ని గుండం గుర్తు ఉన్న క్యాలెండర్ ని ఓ సన్నివేశంలో చూపించారు. ఈ చిహ్నం వన్నియార్ కమ్యూనిటీ సంఘంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులను సూచిస్తుంది. ఇదే విషయంపై గతంలో డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ క్షమాపణలు సైతం చెప్పారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు జైభీమ్ చిత్రయూనిట్ కు మద్దతుగా నిలిచారు. ఈ సినిమా విడుదల సమయంలో హీరో సూర్యతోపాటు డైరెక్టర్ జ్ఞానవేల్ కు కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో వారికి పోలీసులు రక్షణ కల్పించారు.




