Priyanka Arul Mohan: మహేష్ సరసన కలువ కన్నుల చిన్నది.. ప్రియాంకను వరించిన లక్కీ ఛాన్స్..

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంది. ఆ తర్వాత శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీలో మెప్పించింది.

Priyanka Arul Mohan: మహేష్ సరసన కలువ కన్నుల చిన్నది.. ప్రియాంకను వరించిన లక్కీ ఛాన్స్..
Mahesh Priyanka
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 18, 2022 | 12:35 PM

న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది తమిళ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan). మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంది. ఆ తర్వాత శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీలో మెప్పించింది. తెలుగులో హిట్స్ అందుకున్నప్పటికీ ప్రియాంకకు మాత్రం టాలీవుడ్‏లో అంతగా ఆఫర్లు రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ ప్రియాంక వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇక ఇటీవల తమిళ్ స్టార్ శివకార్తికేయన్ జోడిగా డాక్టర్ వరుణ్ చిత్రంలో పద్మినీగా నటించి అలరించింది. ప్రియాంక చివరిసారిగా కనిపించిన చిత్రం డాన్. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ అమ్మడుకు మరో లక్కీ ఛాన్స్ వచ్చిందట. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన ప్రియాంక కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ నెలలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించింది. ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఇందులో మహేష్ సరసన ఇద్దరు కథానాయికలుగా నటిస్తున్నారట. మొదటి హీరోయిన్ పూజా హెగ్డే కాగా.. రెండవ హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్‏ను ఎంపిక చేశారట. అయితే ముందుగా ఈ పాత్ర కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలక్ట్ చేయగా.. ఆమె రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు అదే పాత్ర కోసం ప్రియాంకను సెలక్ట్ చేశారని టాక్. దాదాపు పదేళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!