Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కు మరో అరుదైన గౌరవం.. ఖుషీ అవుతోన్న ఫ్యాన్స్‌..

India day Parade: టాలీవుడ్ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు (Allu Arjun ) అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 21వ తేదీన న్యూయార్క్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్‌లో (India day Parade) పాల్గొనాల్సిందిగా బన్నీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.

Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కు మరో అరుదైన గౌరవం.. ఖుషీ అవుతోన్న ఫ్యాన్స్‌..
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Jul 18, 2022 | 11:40 AM

India day Parade: టాలీవుడ్ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు (Allu Arjun ) అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 21వ తేదీన న్యూయార్క్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్‌లో (India day Parade) పాల్గొనాల్సిందిగా బన్నీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ (FIA) అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 21న జరిగే 40వ భారత దినోత్సవ పరేడ్‌కు అల్లు అర్జున్‌ నాయకత్వం వహిస్తారని FIA అధ్యక్షుడు కెన్నీ దేశాయ్‌ తెలిపారు. ఈవేడుకలోనే భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలను నిర్వహించునున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో బన్నీతో పాటు ఎన్‌వైసీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ సహా ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా ఐకాన్‌స్టార్‌ ఈ అరుదైన ఆహ్వానం అందడం పట్ల బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఇదే సినిమా సీక్వెల్‌ కోసం రెడీ అవుతున్నారు. పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకోసం తన లుక్‌ను మరింత మార్చుకున్నారట అల్లు అర్జున్‌. ప్రస్తుతం ప్రొ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇందులో మక్కల్‌సెల్వన్‌ విజయ్‌ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..