AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోయిన్ మొహం మీదే నాకు నువ్వంటే ఇష్టంలేదని చెప్పేశా..! జగ్గూ భాయ్ మాములోడుకాదు

సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జగపతి బాబు ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ ల్లో జగపతిబాబుకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నారు. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జగపతిబాబు.

ఆ స్టార్ హీరోయిన్ మొహం మీదే నాకు నువ్వంటే ఇష్టంలేదని చెప్పేశా..! జగ్గూ భాయ్ మాములోడుకాదు
Jagapathi Babu
Rajeev Rayala
|

Updated on: Jul 17, 2025 | 1:30 PM

Share

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతి బాబు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జగపతి బాబు. కేవలం ఫ్యామిలీ హీరోగానే కాదు.. సముద్రం, అంతపురం లాంటి సినిమాలతో మాస్ హీరోగానూ క్రేజ్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు జగపతి బాబు సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. జగపతి బాబు సినిమా వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ కు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇక హీరోగా రాణించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా అదరగొడుతున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో జగపతి బాబు విలన్ గా మారారు.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఎవరో కనిపెట్టరా.?

లెజెండ్ సినిమాలో తన విలనిజం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు జగ్గూభాయ్. ఆతర్వాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. పలు సినిమాల్లో విలన్ గా ఇంకొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు జగపతి బాబు. రీసెంట్ గా సలార్, పుష్ప 2 సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే జగపతిబాబుకు సంబందించిన ఓ పాత వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఆయన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతే కాదు ఓ హీరయిన్ గురించి కూడా మాట్లాడారు జగపతి బాబు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! జయం సినిమా చిన్నది.. ఎంత మారిపోయింది..!! స్టార్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..

తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఆర్జీవీ గురించి మాట్లాడుతూ.. “నేను రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాం.. అతను తిక్కలోడే, నేను తిక్కలోడినే మా ఇద్దరికీ పడదు అని అన్నారు. మూడు పెగ్గుల తర్వాత ఇద్దరికీ గొడవ అవుతుంది అని సరదాగా చెప్పారు జగపతి బాబు. అలాగే గాయం సినిమా అప్పుడు ఊర్మిళ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అన్నాడు.దానికి నేను నాకు ఆ అమ్మాయికి అంత కెమిస్ట్రీ ఏమీ అనిపించలేదు అన్నాను. అప్పుడు ఆర్జీవీ ఆ అమ్మయిని పిలిచి నువ్వంటే ఇతనికి ఇష్టం లేదంట అని చెప్పాడు. ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం లేదు అని నన్ను అడిగింది. దానికి నాకు చిరాకు వచ్చి సరే ఇప్పుడు చెప్తున్నా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేశా.. దానికి ఆర్జీవీ.. లేదు ఊర్మిళ అంటే ఇష్టం అని చెప్పు అప్పుడే నేను గాయం సినిమా ఫినిష్ చేస్తా అన్నాడు. నాకు ఊర్మిళ అంటే ఇష్టం లేదు, ఆర్జీవీ అంటే ఇష్టం లేదు.. నాకు శ్రీదేవి అంటే ఇష్టం కాబట్టి ఈ ఇద్దరూ నాకు ఇష్టం లేదు” అని జగపతి బాబు చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్