700 సినిమాలు చేస్తే 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రలే.. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? ఆయన తెలుగు సినిమాల్లో ఓ వెలువెలిగిన నటుడు. స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులే నవ్వులు. తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరు.. దాదాపు 700 సినిమాల్లో నటించిన ఆయన 200సినిమాల్లో తాగుబోతు పాత్రలే చేశారు. ఆయన ఎవరో గుర్తుపట్టారా.?

సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీల కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరోలు, హీరోయిన్స్ త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఆ హీరో చిన్నప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.? ఆ హీరోయిన్ ను గుర్తుపట్టారా.? అంటూ రకరాకారకాల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఈ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ నటుడి ఫోటోలు వైరల్ గా మారాయి. పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా.? ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులే నవ్వులు.. ఎలాంటి పాత్రైనా ప్రాణం పెట్టి నటించే నటుడు ఆయన.. ఇంతకూ ఆ నటుడు ఎవరో గుర్తుపట్టారా.?
ఇది కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఎవరో కనిపెట్టరా.?
పై ఫొటోలో ఉన్న దిగజా నటుడు ఎవరో కాదు తన హాస్యంతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించి.. థియేటర్స్లో నవ్వులు పూయించిన మైలవరపు సూర్యనారాయణ అలియాస్ ఎం.ఎస్ నారాయణ. కమెడియన్ ఎం. ఎస్. నారాయణ 1995లో పెదరాయుడు సినిమాతో స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు రచయితగా కొన్ని సినిమాలకు పని చేశారు. కొన్ని నాటకాలు రాశారు. అలాగే దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పని చేశారు. ఇక నటుడిగా దాదాపు 700సినిమాల్లో నటించారు ఎంఎస్.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! జయం సినిమా చిన్నది.. ఎంత మారిపోయింది..!! స్టార్ హీరోయిన్స్‌ను బీట్ చేసేలా ఉందిగా..
అలాగే దర్శకుడిగా మారి కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్.. తాగుబోతు పాత్రల్లో ఎక్కువగా కనిపించి ఆకట్టుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. ఎంఎస్ అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించారు. ఎంఎస్ కు ఇద్దరు కుమారులు విక్రమ్, శశికిరణ్. విక్రమ్ పలు సినిమాల్లో నటించాడు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్ శీను తదితర చిత్రాల్లో తన నటనతో నవ్వులు పూయించారు ఎం.ఎస్ నారాయణ.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అచ్చం మీరాజాస్మిన్‌లానే ఉందే.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




