Jagame Thandhiram Teaser : తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ హీరో నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత కూడా తెలుగులో ధనుష్ సినిమాలు చాలా డబ్ అయ్యాయి.ఇదిలా ఉంటే త్వరలో ధనుష్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన’జగమే తంతిరమ్’ సినిమాతో రానున్నాడు ధనుష్. ఈ సినిమాను తెలుగులో జగమే తంత్రం అనే టైటిల్ తో తీసుకురానున్నారు. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసిన మేకర్స్.. చివరకు ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా విడుదల చేయనున్నారు.
ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ధనుష్ కెరీర్ లో 40వ సినిమాగా ఇది రూపొందింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కేకిన ఈ సినిమాలో ధనుష్ సురులి అనే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. కాగా ఈసినిమా రిలీజ్ విషయం పై మూవీమేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.
‘జగమే తంతిరమ్’… టీజర్