Jabardasth Shanthi Swaroop: అమ్మకు తెలియకుండానే ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ శాంతి స్వరూప్.. ఎందుకంటే..
ఎప్పుడూ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన శాంతి స్వరూప్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ నవ్విస్తూ వీడియోస్ పంచుకున్న శాంతి స్వరూప్ ఇప్పుడు తన తల్లికి తెలియకుండానే సొంతింటిని అమ్మేస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు కారణం తన తల్లికి సర్జరీ చేయాల్సి ఉందని.. ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

జబర్దస్త్ శాంతి.. అలియాస్ శాంతి స్వరూప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో లేడీ గెటప్‌లో కనిపించి తన కామెడీతో అందరినీ నవ్వించారు. అటు జబర్దస్త్ షో చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అందులో తన లైఫ్ స్టోరీతోపాటు.. కాస్ట్యూమ్స్ డిజైన్స్, కామెడీకి సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటుంటారు. అయితే ఎప్పుడూ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన శాంతి స్వరూప్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ నవ్విస్తూ వీడియోస్ పంచుకున్న శాంతి స్వరూప్ ఇప్పుడు తన తల్లికి తెలియకుండానే సొంతింటిని అమ్మేస్తున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందుకు కారణం తన తల్లికి సర్జరీ చేయాల్సి ఉందని.. ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గత కొద్ది రోజులుగా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. ప్రస్తుతం తనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె ఆసుపత్రి ఖర్చుల కోసం ఇంటిని అమ్మేస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు శాంతి స్వరూప్. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. అయితే ఇల్లు అమ్ముతున్నట్లు తన తల్లికి తెలియదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఎంతో బాధపడుతుందని అందుకే చెప్పలేదని శాంతి స్వరూప్ ఇన్ స్టా ద్వారా తెలిపారు.




View this post on Instagram
ఇక శాంతి స్వరూప్ వీడియో చూసిన నెటిజన్స్ అతడికి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. తొందర్లోనే మీ అమ్మగారు కోలుకుంటారని.. తల్లి కోసం నున్వు చేస్తోన్న త్యాగం గొప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు తనకోసం ఉన్న ఇప్పుడు లేకుండా పోతుందని.. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.