Pushpa: పుష్పలో మొదట హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా.? బన్నీ కంటే ముందు..
బన్నీ ఈ సినిమాలో తన నటన విశ్వ రూపాన్ని చూపించాడు. ఓవైపు అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా కనిపిస్తూనే మరోవైపు యాక్షన్ సీన్స్‌లోనూ దుమ్మురేపాడు. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన మేనరిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎంతలా అంటే విదేశీ క్రికెటర్లు సైతం మైదానాల్లో తగ్గేదేలే అంటూ బన్నీ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేసేంతాలా. అంతలా ఇంపాక్ట్ చూపించిన ఈ పాత్రకు నేషనల్ అవార్డు రావడం సరైన నిర్ణయమే అంటూ ఫ్యాన్స్‌తో పాటు..
పుష్ప.. ఈ సినిమా సాధించిన విజయం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా సినిమాలో విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా రికార్డుల సునామిని సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. దేశం మొత్తం బన్నీని పుష్పరాజ్‌గానే చూసింది. ఈ సినిమాలో బన్నీ అద్భుత నటనకు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అంతా ఫిదా అయ్యారు. అందుకే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో బన్నీకి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సైతం దక్కింది.
బన్నీ ఈ సినిమాలో తన నటన విశ్వ రూపాన్ని చూపించాడు. ఓవైపు అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా కనిపిస్తూనే మరోవైపు యాక్షన్ సీన్స్‌లోనూ దుమ్మురేపాడు. ముఖ్యంగా తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన మేనరిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎంతలా అంటే విదేశీ క్రికెటర్లు సైతం మైదానాల్లో తగ్గేదేలే అంటూ బన్నీ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేసేంతాలా. అంతలా ఇంపాక్ట్ చూపించిన ఈ పాత్రకు నేషనల్ అవార్డు రావడం సరైన నిర్ణయమే అంటూ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా ప్రేక్షకులు సైతం ఒప్పుకుంటున్నారు. అంతేకాదు పుష్ప ద్వారా తెలుగు సినిమాకు మరో అరుదైన గౌరవం కూడా లభించింది. 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అయితే ఇంతటి సంచలనం సృష్టించిన పుష్పరాజ్ పాత్రకు దర్శకుడు సుకుమార్ తొలుత బన్నీని అనుకోలేదని మీకు తెలుసా.? అవును పుష్పరాజ్ పాత్రకు బన్నీ మొదటి ఛాయిస్ కాదు. తొలుతు సుకుమార్ పుష్ప కథను మహేష్‌బాబు చెప్పారట. మహేష్ కూడా కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సుకుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మహేష్ అంతకుముందే ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. ఈ కారణంతోనే మహేష్ పుష్పలో నటించలేదంటా. ఇదిలా ఉంటే.. మహేశ్‌కు కథ చెప్పిన సమయంలో సుకుమార్ స్టోరీలైన్ కాస్త డిఫ్రెంట్‌గా చెప్పాడంటా. మహేష్ మ్యానరిజాన్ని దృష్టిలో పెట్టుకొని స్టోరీ లైన్ కాస్త విభిన్నంగా ప్లాన్ చేశాడని తెలిపారు. అలా బన్నీ కాస్త పుష్పరాజ్ నటించాల్సి వచ్చిందన్నమాట.
ఇదలా ఉంటే మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో అంతకు ముందు ‘వన్ నేనొక్కడినే’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో మహేష్ మునుపెన్నడూ కనిపించని లుక్, మ్యానరిజంతో అదరగొట్టాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..