AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kevvu Karthik : కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన తల్లి

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకరు. తన కామెడితో ప్రేక్షకులను నవ్వించాడు కెవ్వు కార్తీక్. ముఖ్యంగా అక్కినేని నాగార్జునను అనుకరిస్తూ ఆకట్టుకున్నాడు. ముక్కు అవినాష్ టీమ్ లో చేసిన కార్తీక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా కార్తీక్ ఇంట్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Kevvu Karthik : కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన తల్లి
Kevvu Karthik
Rajeev Rayala
|

Updated on: May 16, 2024 | 12:46 PM

Share

ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వేణు, ధనరాజ్ దర్శకులుగానూ మారి సినిమాలు చేశారు. ఇక జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకరు. తన కామెడితో ప్రేక్షకులను నవ్వించాడు కెవ్వు కార్తీక్. ముఖ్యంగా అక్కినేని నాగార్జునను అనుకరిస్తూ ఆకట్టుకున్నాడు. ముక్కు అవినాష్ టీమ్ లో చేసిన కార్తీక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా కార్తీక్ ఇంట్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

కెవ్వు కార్తీక్ తల్లి కన్నుమూశారు. దాంతో కార్తీక్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక్ తల్లి గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. అయితే ఆమె బుధవారం రాత్రి సమయంలో కన్నుమూశారు. ఇప్పుడు కార్తీక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. విషయం తెలుసుకున్న సినీ నటులు. తొలి కళాకారులు సంతాపం తెలుపుతున్నారు. కార్తీక్ కు దైర్యం చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో తల్లి మరణం గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు కెవ్వు కార్తీక్. “అమ్మ గత 5సంవత్సరాల 2 నెలలు గా కాన్సర్ ఏ భయపడే విధం గా కాన్సర్ పై అలుపెరుగనిపోరాటం చేసావ్ . . నీ జీవితంఅంతా యుద్ధమే. . మమ్మల్ని కన్నావు నాన్న కి తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడవ్ .. అమ్మ ఈ 5 సంవత్సరాలనుండి ఎలా ఒంటరిగా పోరాడాలి అని నేర్పావు నీ ఆత్మస్తర్యం నాలో ధైర్యాన్ని నిపింది. . అన్ని నేర్పవు కానీ నువ్వు లేకుండాఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకు అమ్మ… మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, మా అమ్మ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికి నా పాదాభివందనం” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు కార్తీక్. మీ పవిత్ర ఆత్మ కి శాంతి చేకూరాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో