- Telugu News Photo Gallery Cinema photos Jr. NTR following Mahesh Babu in vacations, now going to Turkey for his birthday
Jr.NTR: ఆ విషయం లో మహేష్ బాబును గుడ్డిగా ఫాలో అవుతున్న జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ వెళ్లారు. మళ్లీ ఆయన ఇండియాకు వచ్చేదెప్పుడు..? అసలు తారక్ ఎక్కడికి వెళ్లారు..? నెల రోజులుగా దేవరకు బ్రేక్ ఇచ్చిన జూనియర్.. మళ్లీ కొరటాల సినిమాలో అడుగు పెట్టేదెప్పుడు..? ఈ సారి తారక్ పుట్టిన రోజుకు రాబోయే సర్‌ప్రైజులు ఏంటి..? అన్నింటికీ సమాధానం మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం పదండి.. మన హీరోలకు మహేష్ బాబు ఏం నేర్పినా.. నేర్పించకపోయినా వెకేషన్‌కు వెళ్లడం మాత్రం బాగా నేర్పించేసారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: May 16, 2024 | 12:50 PM

జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ వెళ్లారు. మళ్లీ ఆయన ఇండియాకు వచ్చేదెప్పుడు..? అసలు తారక్ ఎక్కడికి వెళ్లారు..? నెల రోజులుగా దేవరకు బ్రేక్ ఇచ్చిన జూనియర్.. మళ్లీ కొరటాల సినిమాలో అడుగు పెట్టేదెప్పుడు..? ఈ సారి తారక్ పుట్టిన రోజుకు రాబోయే సర్‌ప్రైజులు ఏంటి..? అన్నింటికీ సమాధానం మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం పదండి..

మన హీరోలకు మహేష్ బాబు ఏం నేర్పినా.. నేర్పించకపోయినా వెకేషన్‌కు వెళ్లడం మాత్రం బాగా నేర్పించేసారు. ఈయన కంటే ముందు కూడా హీరోలు వెకేషన్‌కు వెళ్లేవారు. కానీ మహేష్ కారణంగానే ఈ పదానికి క్రేజ్ బాగా పెరిగింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా టర్కీ వెళ్లారు. అక్కడే బర్త్ డే వేడుకలు కూడా జరుపుకోనున్నారు.

నెల రోజులుగా వార్ 2 సినిమాతోనే బిజీగా ఉన్నారు తారక్. ఆ సినిమాకు 60 రోజుల డేట్స్ ఇచ్చారు జూనియర్. మొన్నటి వరకు ముంబైలోనే తారక్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు అయన్ ముఖర్జీ. టర్కీ నుంచి వచ్చాక దేవరకు డేట్స్ కేటాయించారు తారక్. మరోవైపు ఎన్టీఆర్ లేకపోయినా.. దేవర షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వలేదు కొరటాల శివ.

దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేసాకే మళ్లీ వార్ 2 వైపు వెళ్లనున్నారు తారక్. దేవరతో పాటు వార్ 2కు కూడా కమిట్ అవ్వడంతో.. ఈ రెండింటి మధ్య క్లాష్ తప్పదని ముందు నుంచి అనుకుంటున్నారంతా. తారక్‌కు తెలియంది కాదీ విషయం. అందుకే డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు యంగ్ టైగర్. నిన్నటి వరకు వార్ 2కి ఇచ్చి.. ఆఫ్టర్ వెకేషన్ దేవర అంటున్నారు.

వార్ 2లో స్పైగా నటిస్తున్నారు తారక్. ఈ సినిమా కోసం బరువు కూడా తగ్గడంతో పాటు.. బాగా మేకోవర్ అయ్యారు. ఇదిలా ఉంటే మే 20న తారక్ బర్త్ డే సర్‌ప్రైజులు బాగానే ఉండబోతున్నాయి. దేవర ఫస్ట్ సింగిల్ అదే రోజు విడుదల కానుంది.. ఇక వార్ 2 లుక్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్ రానుంది.





























