- Telugu News Photo Gallery Cinema photos Pushpa 2 makers reveal crazy update on the occasion of Anasuya Bharadwaj Birthday
Anasuya Bharadwaj: అనసూయ పుట్టినరోజు వేడుక.. పుష్ప టీం సర్‌ప్రైజ్ అదిరిందిగా..!
అనసూయ భరద్వాజ ఒక భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నటి. ఆమె తెలుగు సినిమాలతో టెలివిజన్‌లో పని చేస్తుంది. క్షణం, రంగస్థలం చిత్రాలతో నటనకు అత్యంత ప్రసిద్ధి చెందింది. తాజాగా బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది ఈ వయ్యారి భామ. ఈ ఫోటోలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగమ్మ. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Updated on: May 16, 2024 | 12:49 PM

అనసూయ భరద్వాజ ఒక భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత మరియు నటి. ఆమె తెలుగు సినిమాలతో టెలివిజన్‌లో పని చేస్తుంది. క్షణం, రంగస్థలం చిత్రాలతో నటనకు అత్యంత ప్రసిద్ధి చెందింది.

తాజాగా బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది ఈ వయ్యారి భామ. ఈ ఫోటోలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగమ్మ. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

2003 ఎన్టీఆర్ నాగ సినిమాలో తొలిసారి నటించింది. ఆ తర్వాత దాదాపు ఒక దశాబ్దం తర్వాత జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై మెప్పింది. తర్వాత టెలివిజన్ వేదికగా అనే షోలను హోస్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చికుంది ఈ అమ్మడు.

దీంతో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీని తర్వాత నటించిన క్షణం సినిమాతో వెండితెరపై కూడా ఆకట్టుకుంది. తర్వాత వరుస అవకాశలు క్యూ కట్టాయి. రామచరణ్ రంగస్థలంలో రంగమ్మ అత్తాగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

దీని తర్వాత పుష్ప 1 ది రైజ్ లో దాక్షాయణిగా నెగటివ్ పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ సినిమాలో నటిస్తుంది. పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఈ వయ్యారి లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.





























