- Telugu News Photo Gallery Cinema photos Cinema Theatres are closing due to ipl matches and elections
Cinema Theatres: టాలీవుడ్‌కు డేంజర్ బెల్స్.. మూతపడనున్న థియేటర్స్
ఏదైతే జరక్కూడదనుకున్నారో అదే జరుగుతుంది. కళకళలాడాల్సిన సమ్మర్ కాస్తా పూర్తిగా బోసిపోయింది. కనీసం రెంట్లు కూడా రాక థియేటర్స్ మూత పడుతున్నాయి. అసలు టాలీవుడ్‌కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? ఈ స్థాయిలో ఇండస్ట్రీ రెవిన్యూ దిగజారడానికి కారణమేంటి..? టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేదెప్పుడు..? మూలిగే నక్కపై తాటిపండు కాదు.. ఏకంగా పది తాటిచెట్లు పడ్డట్లుంది ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి. అరే.. అసలే సినిమాల్లేక నానా ఇబ్బందులు పడుతుంటే
Updated on: May 16, 2024 | 12:35 PM

ఏదైతే జరక్కూడదనుకున్నారో అదే జరుగుతుంది. కళకళలాడాల్సిన సమ్మర్ కాస్తా పూర్తిగా బోసిపోయింది. కనీసం రెంట్లు కూడా రాక థియేటర్స్ మూత పడుతున్నాయి. అసలు టాలీవుడ్‌కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? ఈ స్థాయిలో ఇండస్ట్రీ రెవిన్యూ దిగజారడానికి కారణమేంటి..? టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేదెప్పుడు..?

మూలిగే నక్కపై తాటిపండు కాదు.. ఏకంగా పది తాటిచెట్లు పడ్డట్లుంది ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి. అరే.. అసలే సినిమాల్లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు తెలంగాణ థియేటర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీని మరింత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది.

మే 17 నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూతబడబోతున్నాయి. వింటున్నారుగా.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తున్న మాటలు. ఇందులో సమ్మెలు ఏం లేవు.. సమ్మర్‌ను మన హీరోలు పట్టించుకోలేదు కాబట్టే జనం లేక.. థియేటర్స్ నడపలేక మూసేస్తున్నామని చాలా క్లారిటీగా చెప్పారాయన.

నిర్మాతలు ముందుకొచ్చి ఫీడింగ్ ఇస్తే.. ఓపెన్ చేస్తామంటున్నారు. కానీ కల్కి వచ్చే వరకు థియేటర్లకు ఆ కళ లేనట్లే. సింగిల్ స్క్రీన్స్ మూతబడినా.. మల్టీప్లెక్స్‌లు మాత్రం తెరిచే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ సింగిల్ స్క్రీన్ ఖర్చు రోజుకు 12 వేలు దాటేస్తుంది.

సిటీలో అయితే అది 18 వేల వరకు ఉంటుంది. కనీసం ఇది కూడా రావట్లేదు కాబట్టే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హరోం హర లాంటి సినిమాలు వస్తున్నాయి. మరి వీటితో అయినా థియేటర్లకు మంచి రోజులొస్తాయేమో చూడాలిక.




