AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR Movie: రాకింగ్‌ రాకేష్‌ ‘కేసీఆర్‌’ మూవీ రిలీజ్‌కు బ్రేకులు.. కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌

'కేసీఆర్‌' (కేశవ్ చంద్ర రమావత్) పేరుతో ఓ సినిమాను నిర్మించడంతో పాటు అందులో హీరోగానూ నటిస్తున్నాడు రాకింగ్ రాకేష్. కొన్ని రోజుల క్రితం తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా కేసీఆర్‌ సినిమా ఓపెనింగ్‌ గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. నవంబర్‌లోనే కేసీఆర్‌ సినిమాను విడుదల చేయాలని రాకింగ్‌ రాకేష్‌ భావించారట.

KCR Movie: రాకింగ్‌ రాకేష్‌ 'కేసీఆర్‌' మూవీ రిలీజ్‌కు బ్రేకులు.. కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌
Jabardasth Fame Rocking Rakesh
Basha Shek
|

Updated on: Nov 14, 2023 | 6:53 PM

Share

జబర్దస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్‌ ఒకడు. ఒక కంటెస్టెంట్‌గా ఈ కామెడీ షోలోకి అడుగుపెట్టిన అతను తన పంచులు, ప్రాసలతో టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. ఇప్పుడు తన ట్యాలెంట్‌ను బిగ్ స్క్రీన్‌పై కూడా చూపించేందుకు సిద్ధమవుతున్నాడీ స్టార్‌ కమెడియన్‌. ‘కేసీఆర్‌’ (కేశవ్ చంద్ర రమావత్) పేరుతో ఓ సినిమాను నిర్మించడంతో పాటు అందులో హీరోగానూ నటిస్తున్నాడు రాకింగ్ రాకేష్. కొన్ని రోజుల క్రితం తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా కేసీఆర్‌ సినిమా ఓపెనింగ్‌ గ్రాండ్‌గా జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. నవంబర్‌లోనే కేసీఆర్‌ సినిమాను విడుదల చేయాలని రాకింగ్‌ రాకేష్‌ భావించారట. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాకింగ్ రాకేష్‌ కేసీఆర్‌ సినిమాను విడుదల చేయవద్దని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించిందట. తాజాగా ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్‌ చేశాడు జబర్దస్త్ కమెడియన్‌. తన సినిమాపై వస్తోన్న వదంతులపై క్లారిటీ ఇచ్చాడు. తానెవరికీ బినామీ కాదంటూ స్పష్టత ఇచ్చాడు.

‘ నా కేసీఆర్‌ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేద్దామని పక్కా ప్రణాళికలు వేసుకున్నాం. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి కొన్ని ఆదేశాలు వచ్చాయి. ఇది బయోపిక్కా? ఏ జానర్ అనేది రివీల్ చేయడం లేదు. నా మూవీ గురించి సెన్సార్ వాళ్లకు అన్నీ విషయాలు వివరించాను. ఎన్నికల కోడ్ ప్రకారం ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయకూడదట. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నాను. పబ్లిసిటీకి మరింత సమయం దొరికిందని అనుకుంటున్నాను. అలానే నాకు ఎవరు డబ్బులిచ్చి ఈ సినిమాని చేయమని చెప్పలేదు. నాకున్న ప్యాషన్ తో ఈ సినిమా తీస్తున్నా. మీరు నా నిర్ణయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాను’ అని రాకేశ్ ఎమోషనల్‌ అయ్యాడు. ఈ వీడియోను ‘ఏది జరిగినా మన మంచికే మీ ఆశీస్సులతో’ అంటూ సోషల్ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్‌ కమెడియన్‌కు ధైర్యం చెబుతున్నారు. త్వరలోనే మంచి రోజులొస్తాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాకింగ్ రాకేష్ ఎమోషనల్ వీడియో..

దీపావళి సంబరాల్లో రాకేష్- జోర్దార్ సుజాత దంపతులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!