Anasuya Bharadwaj: వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్.. స్త్రీల గురించి ఏం చెప్పిందంటే
ఇప్పటికే చాలా సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పింసిన్ది అనసూయ. ఈ అమ్మడుకి సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో బిజీ అయ్యింది ఈ అమ్మడు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు చాలా సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ అనసూయ భరద్వాజ్. యాంకర్ గా పలు షోలను విజయవంతంగా నడిపిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే చాలా సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పిస్తుంది అనసూయ. ఈ అమ్మడుకి సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో బిజీ అయ్యింది ఈ అమ్మడు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు చాలా సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు స్ట్రాజ్ కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. అలాగే సమాజంలో జరిగే సంఘటనల పై కూడా స్పందిస్తూ ఉంటుంది.
తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మహిళల రక్షణ గురించి అనసూయ మాట్లాడింది. ఈ మేరకు ఆమె వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ గురించి ప్రస్తావించింది. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అలాగే శ్రీ రాముడు చెప్పిన ఓ వాక్యాన్ని పంచుకుంది.. ఇల్లు, బట్టలు, ఇంటి గోడలు, తలుపులతో పాటు మరికొన్ని విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు. కానీ ఆమె స్వభావం( క్యారెక్టర్) మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను కాపాడుతుంది అంటూ రాసుకొచ్చింది అనసూయ. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ సినిమాల విషయానికొస్తే.. తెలుగు సినిమాలతో పాటు తమిళ్ మూవీస్‌లోనూ అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.
అనసూయ ట్విట్టర్ పోస్ట్
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.